12 April, 2026 | 11:15 PM

రోడ్డు ప్రమాదాలపై అవగాహన సదస్సు

28-01-2026 04:25 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో బుధవారం రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సులు నిర్వహించారు. రవాణా శాఖ అధికారి రజినీకాంత్ ఆధ్వర్యంలో పాఠశాలలో విద్యార్థులకు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. రోడ్డు దాటేటప్పుడు నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. స్కూల్ బస్సుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది నిఖిత్ విలాస్ తేజ తదితరులు ఉన్నారు.