1 May, 2026 | 2:12 AM

ఆర్టీసీ సేవలను ప్రజలు వినియోగించుకోవాలి

01-05-2026 12:52 AM

మేనేజర్ సునీత 

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), ఏప్రిల్ 30:   టీజీఎస్ ఆర్టీసీ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని సూర్యాపేట ఆర్టీసీ డిపో మేనేజర్ సునీత అన్నారు.గురువారం సూర్యానాయక్ తండా సర్పంచ్ లూనావత్ కృష్ణనాయక్ తో కలిసి సూర్యాపేట - నెమ్మికల్,కందగట్ల,మంగలితండా, సూర్యానాయక్ తండాల మీదుగా నూతన బస్ సౌకర్యం కోసం సర్వే నిర్వహించారు.

అనంతరం వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించేందుకు త్వరలో నూతన బస్సు సేవలు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ బానోతు సైదులునాయక్,మంగలితండా సర్పంచ్ కృష్ణ,నాయకులు భద్రునాయక్,నర్సింహా,వీరన్న,వెంకటేష్,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.