3 July, 2026 | 5:15 PM

Breaking News

కాంగ్రెస్ కు ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టదు   •   కామ్రేడ్ అరుణోదయ నాగన్న మృతి ఉద్యమానికి తీరని లోటు   •   కేటీఆర్, హరీష్ లకు వార్తల్లో నిలవాలన్న తాపత్రయం.!   •   ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   యూరియా రైతులకు సరిపడా అందించాలి   •   తెలంగాణలో ఏపీ పోలీసుల చర్యలు ఖండనీయం   •   సింగరేణి ప్రధాన కార్యాలయంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట   •   37వ డివిజన్లో 77 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   నవ మహిళా సాధికార కేంద్రంలో మహిళలకు చెక్కుల పంపిణీ   •   పసికందు కిడ్నాప్.. 72 గంటల్లో కేసును చేదించిన పోలీసులు   •  

ఊరటనిచ్చిన వర్షం

30-06-2025 12:00 AM

నిర్మల్ జూన్ 29(విజయ క్రాంతి) : వానకాలం సీజన్లో రైతులు సాగుచేసిన పం టలకు గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు ఊరటనిచ్చాయి. జిల్లాలో తొలకరి వర్షాలకు రైతులు పత్తి సోయా మొక్కజొన్న పప్పు దినుసు పంటలు వేసుకోగా ఆ తర్వాత వర్షాలు లేకపోవడంతో అవి మొలకెత్తినప్పటికీ ఎదుగుదల లేకపోవడంతో రైతులు ఆందోళన చెందారు.

అదే రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంటలకు మేలు చేయడంతో రైతులు పంట భూముల్లో కలుపుతీత పనులు ముమ్మరంగా చేపడుతున్నారు. జిల్లా కూలీలతో పాటు మహారాష్ట్ర కూలీలు రావడంతో పనులు జిల్లా వ్యాప్తంగా జోరుగా సాగుతున్నాయి. మొక్కలు ఎదిగిన రైతులు రసాయన మందులను కూడా వాడుతున్నారు.