29 May, 2026 | 3:04 AM

కురిసిన వర్షం తడిసిన ధాన్యం

29-05-2026 02:17 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 28 (విజయక్రాంతి):కాగజ్నగర్ మండలంలో గురు వారం కురిసిన అకాల వర్షంతో కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం తడిసి ముద్దయింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో రైతులు ధాన్యాన్ని కాపాడుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద టార్పాలిన్లు వేసి ధాన్యాన్ని ర క్షించేందుకు ప్రయత్నించినప్పటికీ భారీ వ ర్షానికి ధాన్యం తడవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే శ్రమించి పండించిన పంట నష్టపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.  తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.