21 May, 2026 | 10:34 PM

కురిసిన వర్షం.. తడిసిన ధాన్యం

20-04-2024 02:14 AM


సిద్దిపేట, ఏప్రిల్ 19 (విజయక్రాంతి) : సిద్దిపేట జిల్లాలో శుక్రవారం సాయంత్రం ప లు ప్రాంతాల్లో వర్షం కురిసింది. దుబ్బాక, మద్దూరు, చేర్యాల, జగదేవ్‌పూర్ మండల ల్లో మోస్తరు వర్షం కురిసింది. వర్షానికి కొనుగోలు కేంద్రాలతో పాటు, రైతుల పొలాల వద్ద కల్లాల్లోని ధాన్యం తడిసిపోయింది. దుబ్బాక మార్కెట్ కమిటీ ప్రాంగ ణంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం పూర్తిగా వర్షంతో తడిసిపోయి రైతులు ఇబ్బందులు పడ్డారు. విష యం తెలుసుకున్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి వెంటనే అక్కడికి చేరుకుని తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కాగా జగదేవ్‌పూర్ మండలం చాట్లపల్లిలో ఓ రైతుకు చెందిన ఎద్దు పిడుగుపాటుకు మృతి చెందింది.