29 August, 2026 | 3:00 AM

సోదర, సోదరీమణుల మధ్య.. ప్రేమ, ఆప్యాయతలకు రాఖీ పండుగ ప్రతీక

29-08-2026 01:45 AM

టీజీవో రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు

కలెక్టరేట్‌లో రాఖీలు కట్టిన బ్రహ్మకుమారీలు  

ఖమ్మం, ఆగస్టు 28 (విజయక్రాంతి): సోదర, సోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనురాగం, పరస్పర నమ్మకానికి రాఖీ పండుగ ప్రతీకగా నిలుస్తుందనీ టీజీ వో రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు అన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్లో బ్రహ్మకుమారీలు టీజీవో రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావుకి రాఖీ కట్టి, మిఠాయి అందించారు.

ఈ సందర్భంగా శ్రీనివాసరావు  వారికి శు భాకాంక్షలు తెలిపారు.  అలాగే రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా ప్రజలందరికీ, రాష్ట్ర మహిళా ఉద్యోగులకు  రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పం డుగ కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు, సమాజంలో పర స్పర గౌరవం, సోదరభావం, ఆప్యాయతలను పెంపొందించేందుకు స్ఫూర్తినిస్తుందన్నారు. సోదరీమణుల రక్షణ, గౌరవం, సాధికారత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.

రాష్ట్రంలోని మహిళామణులు, ఉద్యోగులందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాల తో, సోదరభావంతో, ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీజీవో జిల్లా కార్యదర్శి మోదుగు వేలాద్రి,  టీఎన్జీవో జిల్లా కార్యదర్శి కొనదన శ్రీనివాసరావు, టీఎన్జీవో మాజీ అధ్యక్షులు పొట్ట పింజర రామయ్య, జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ కే దుర్గాప్రసాద్, తెలంగాణ మైనారిటీ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు అస్లాం, బీసీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంంట్ ఏవో చంద్రశేఖర్ కళ్యాణ్, బ్రహ్మకుమారీలు రాజయోగిని, బీకే అరుణ, బీకే గీత తదితరులు పాల్గొన్నారు.