calender_icon.png 5 February, 2026 | 5:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా యోగానంద లక్ష్మీనరసింహుడి రథోత్సవం

05-02-2026 12:00:00 AM

  1. భారీగా తరలివచ్చిన భక్తులు

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), ఫిబ్రవరి 4: జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలోని శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం రాత్రి నుండి బుధవారం తెల్లవారుజాము వరకు రథోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ బ్రహ్మోత్సవాలలో రథోత్సవం ఎంతో ప్రధానమైంది.తొలుత ఆలయంలో సదస్యం కార్యక్రమాన్ని జరిపారు.

ఆ తర్వాత నరసింహస్వామి శ్రీదేవి, భూదేవిలను రథంపై ఊరేగించారు.రథోత్సవం ఊరేగింపు దేవాలయం నుంచి స్థానిక వై జంక్షన్ వరకు వెళ్లి అక్కడ భక్తులకు దర్శనమిచ్చి తెల్లవారుజామున ఆలయానికి చేరింది.ఈ సందర్భంగా భక్తులు ఇంటింటికి నీళ్లారబోసి,హారతులిచ్చి,టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. కాగా రథోత్సవం సందర్భంగా ఫోక్ సింగర్స్ ఆట, పాట, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఈ వేడుకలకు ఉభయ రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామి,అమ్మవార్లను దర్శించుకుని రథోత్సవాన్ని, సంస్కృతిక కార్యక్రమా లను తిలకించారు. స్థానిక ఎస్త్స్ర ఈట సైదులు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు,హైకోర్టు అడ్వకేట్ దరూరి యోగానంద చార్యులు,ఆలయ చైర్మన్ అనిరెడ్డి రాజేందర్ రెడ్డి,ధర్మకర్తలు బీరెల్లి శ్రీధర్ రెడ్డి,సోమయ్య,బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నర్సింగ శ్రీనివాస్ గౌడ్,కాంగ్రెస్,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మోరపాక సత్యం,శిగ నసీర్ గౌడ్,సర్పంచులు చిల్లంచర్ల విద్యాసాగర్,బింగి కృష్ణమూర్తి,మంచాల లలితారామ్మూర్తి,అర్చకులు,వివిధ గ్రామాల నాయకులు,దేవాదాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.