19 March, 2026 | 12:19 AM

ప్రాణాలు తీసిన ‘రీల్స్’ పిచ్చి

22-07-2024 01:42 AM

బైక్‌పై స్టంట్స్ చేస్తూ యువకుడి మృతి, మరొకరికి తీవ్రగాయాలు

పెద్దఅంబర్‌పేట జాతీయ రహదారిపై ప్రమాదం

ఎల్బీనగర్, జూలై 21: సోషల్ మీడియాలో హైలెట్ కావడానికి యువత చేస్తున్న ప్రమాదకర విన్యాసాలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఎంతోమంది రీల్స్ కోసం వీడియో లు చేస్తూ ప్రాణాలు పోగొట్టుకున్నా రు. అయినా మార్పు రావడం లేదు. శనివారం సాయంత్రం హయత్‌నగ ర్ పోలీస్ స్టేషన్ పరిధి పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీలో జాతీయ రహ దారిపై శివ అనే యువకుడితో పాటు అతని స్నేహితుడు సంపత్ రీల్స్ వీడియో కోసం కేటీఎం బైక్‌పై స్టంట్స్ చేశారు. ఈ క్రమంలోనే బైక్ అదుపుతప్పి శివ అక్కడికక్కడే మృతిచెందగా, సంపత్ తీవ్రంగా గాయప డ్డాడు. హయత్‌నగర్ పోలీసులు సం ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రామకృష్ణ తెలిపారు.