5 March, 2026 | 5:09 AM

కమిషన్ ఇచ్చిన రిపోర్టు ఫైనల్ కాదు!

05-03-2026 12:31 AM
  1. ప్రభుత్వం పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది
  2. తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ చైర్మన్ కే.కేశవరావు

హైదరాబాద్, మార్చి 4 (విజయక్రాంతి): తెలంగాణ విద్యాకమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక ఫైనల్ కాదని, దాన్ని ప్రభు త్వం పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని ప్రభుత్వ సలహాదారు, తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ చైర్మన్ కే.కేశవరావు పేర్కొన్నారు. ప్రభు త్వం వేసిన11 సబ్ కమిటీల్లో విద్యాకమిషన్ ఒకటని, అవి సిఫారసులు మాత్రమేనని, దీనిపై ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు.

కొందరు దీన్ని సోషల్ మీడియాల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. విద్యాకమిషన్ నివేదికపై వస్తున్న విమర్శల నేపథ్యంలో బుధవారం రాష్ట్ర సచి వాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులు, సైనికులకు ఇచ్చే జీతాలను వెలకట్టలేమని, వారికి ఎంత ఇచ్చినా తక్కువేనని, తెలిపారు. ప్రభుత్వం టీచర్ల జీతాలు తగ్గించదని, టీచర్లు గందరగోళం పడాల్సిన అవసరం లేదన్నారు.

కమిషన్ విద్యార్హతలపై వచ్చిన వార్త ల్లో వాస్తవంలేదని, అందరూ అర్హులైన వారే ఉన్నారని, కమిషన్ బాగా కష్టపడి పనిచేసిందని.. రీసెర్చ్ చేసిందని తెలిపా రు.  ఇది ఎడ్యుకేషన్ పాలసీ కాద ని, ఇదోక నివేదిక మాత్రమేనన్నారు. రిపోర్టును కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఒక్కరే రాయలేదని, దాన్ని ఎక్స్‌పర్ట్స్ పరిశీలిస్తారన్నారు. విద్యా కమిషన్ అనేది ఒక బాడీ మా త్రమే అన్నారు.

తాము తెలంగాణ నూతన ఎ డ్యుకేషన్ పాలసీ రూపకల్పనపై తీవ్ర కసరత్తు చేస్తున్నామన్నారు. ఏప్రిల్ చివరికల్లా ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తామని చెప్పారు. కమిషన్ ఇచ్చిన నివేదిక మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని, హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదికను విద్యా శాఖ మంత్రిగా సీఎం అసెంబ్లీలో పెట్టి నిర్ణ యం తీసుకుంటారని ఆయన స్పష్టం చేశారు.