07-02-2026 12:00:00 AM
అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్
నిర్మల్ ఫిబ్రవరి 6 ( విజయ క్రాంతి) : మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర అత్యంత కీలకమని అదనపు కలెక్టర్ రెవెన్యూ కిషోర్ కుమార్ అన్నారు. శుక్రవారం, కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో మైక్రో అబ్జర్వర్లకు రెండవ విడత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మైక్రో అబ్జర్వర్లుగా విధులు నిర్వర్తించే అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. శిక్షణలో, శిక్షకులు అందించే వివరాలను సమగ్రంగా తెలుసుకొని ఎన్నికల్లో విధుల్లో పాల్గొనాలని అన్నారు. సిబ్బందికి సమయపాలన క్రమశిక్షణ అత్యంత కీలకమని గుర్తు చేశారు. బాధ్యతాయుతంగా తమ విధులు నిర్వర్తించి, ఎన్నికల ప్రక్రియను మొత్తం దిగ్విజయంగా పూర్తి చేయాలని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో డీఈవో భోజన్న, ఎల్డీఎం రామ్ గోపాల్, శిక్షకులు, తదితరులు పాల్గొన్నారు.