28 April, 2026 | 2:24 AM

‘ఫార్మా’లో ఆర్గానిక్ సింథసిస్ పాత్ర కీలకం

28-04-2026 12:40 AM
  1. ఐఐఎస్సీ బెంగళూరు ప్రొఫెసర్ ఏటీ బిజు
  2. ఫార్మా రంగంపై విజ్ఞాన్స్ వర్సిటీలో జాతీయ స్థాయి సదస్సు ప్రారంభం
  3. వివిధ రాష్ట్రాల విద్యార్థులు, పరిశోధకుల భాగస్వామ్యం

హైదరాబాద్, ఏప్రిల్ 27(విజయక్రాంతి): ప్రస్తుత ఆధునిక కాలంలో మానవాళి ఎదుర్కొంటున్న కొత్త రకమైన వ్యాధులకు తక్కు వ ఖర్చుతో, సమర్థవంతమైన ఔషధాలను కనుగొనడంలో ’ఆర్గానిక్ సింథసిస్’ ‘గ్రీన్ కెమిస్ట్రీ’ కీలక పాత్ర పోషిస్తున్నాయని ఐఐఎస్సీ బెంగళూరు ప్రొఫెసర్ ఏటీ బిజు పేర్కొ న్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా, భూదా న్ పోచంపల్లి మండలం, దేశ్‌ముఖిలోని వి జ్ఞాన్స్ యూనివర్సిటీలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో సోమవారం రెండ్రోజుల జాతీయ స్థాయి సదస్సు ‘ఎక్స్‌ప్లోరింగ్ న్యూ డైమెన్షన్స్ ఇన్ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ యుటిలైజింగ్ ఆర్గానిక్ సింథసిస్’ ప్రారంభమైంది. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఏఎన్‌ఆర్‌ఎఫ్) ఆర్థిక సహకారంతో నిర్వహిస్తున్న ఈ సద స్సు ప్రారంభోత్సవానికి ప్రొఫెసర్ ఏటీ బిజు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం కాన్ఫరెన్స్ సావనీర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ‘అప్లికేషన్స్ ఆఫ్ ఆర్గానోక్యాటలిసిస్ యూజింగ్ ఎన్-హెటె రోసైక్లిక్ కార్బీన్స్ (ఎన్‌హెచ్‌సీఎస్)’ అనే అం శంపై ప్రొఫెసర్ ఏటీ బిజు కీలకోపన్యాసం చేశారు. తక్కువ ఖర్చుతో, పర్యావరణ హి తంగా ఔషధాలను ఎలా తయారు చేయవచ్చనే అంశంపై వివరణ ఇచ్చారు. కెమికల్ రియాక్షన్స్ వేగవంతం చేయడానికి గతంలో ఖరీదైన లోహాలను ఉపయోగించేవారని, కానీ నేడు ఆర్గానోక్యాటలిసిస్ ద్వారా తక్కువ ఖర్చుతో, విషపూరితం కాని పద్ధతుల్లో ఔషధ తయారీ సాధ్యమవుతోందని తెలిపారు.

ఔషధ తయారీ ప్రక్రియలో వ్యర్థాల ను తగ్గించడం ద్వారా పర్యావరణానికి మే లు చేయాలని, పరిశ్రమలు ఇప్పుడు ‘సస్టైనబుల్ సింథసిస్’ వైపు మొగ్గు చూపుతున్నా యని స్పష్టం చేశారు. సదస్సులో ఐఐఎస్సీ బెంగళూరుకు చెందిన మరొక ప్రముఖ ప్రొ ఫెసర్ దుర్గా ప్రసాద్ హరి ‘రాడికల్ పోలార్ క్రాస్వోవర్ ఫర్ మాలిక్యూలర్ రీమోడలింగ్’ అనే అంశంపై ప్లీనరీ సెషన్ నిర్వహించారు. ఇప్పటికే ఉన్న మాలిక్యూల్స్‌ను రీమోడల్ చేయడం ద్వారా వాటి సామర్థ్యాన్ని పెంచవచ్చని ఆయన ఉదాహరణలతో వివరిం చారు.

హైదరాబాద్‌లోని నైపర్ ప్రతినిధి ప్రొఫెసర్ ఎన్. శంకరయ్య మాట్లాడుతూ ‘క్యాన్సర్ ఔషధాల ఆవిష్కరణలో చిన్న అణువుల సంశ్లేషణ’ అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఫార్మసీ విద్యా ర్థులు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రయోగాత్మక పరిశోధనలపై దృష్టి సారించాలని, తద్వారా భారత్‌ను ’ఫార్మా హబ్’గా మార్చవచ్చని పిలుపునిచ్చారు. విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వరరావు మాట్లాడుతూ యూనివర్సిటీ ఎల్ల ప్పుడూ ఇండస్ట్రీ-అకాడమీ అనుసంధానానికి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.

నాలుగు రాష్ట్రాల విద్యార్థుల భాగస్వామ్యం సదస్సుకు తెలంగాణ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి 500 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు.వీరితోపా టు రీసెర్చ్ స్కాలర్లు, శాస్త్రవేత్తలు సదస్సులో పాల్గొని చర్చలు జరిపారు.అనంతరం జరిగిన పోస్టర్ ప్రజంటేషన్‌లో విద్యార్థులు తమ పరిశోధన పత్రాలను ప్రదర్శించారు. 

మంగళవారం రెండవ రోజు సెషన్లలో భాగంగా పుణే యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ దిలీప్ ధవలే కీలక ప్రసంగం చేయనున్నారు. అనంతరం విద్యార్థుల కోసం పేపర్ ప్రజంటేషన్ పోటీలు, బహుమతుల ప్రధానోత్సవం నిర్వహించను న్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల హెచ్‌ఓడీలు, అధ్యాపక బృందం, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.