లాంజీన్స్ బోటిక్ ప్రారంభించిన సారా అలీ ఖాన్
హైదరాబాద్, 27 ఏప్రిల్ 2026: స్విస్ వాచ్ బ్రాండ్ లాంజీన్స్, హైదరాబాద్‌లోని ఇనార్బిట్ మాల్‌లో ఈరోజు తమ రెండవ బొటిక్‌ను ప్రారంభించింది. ఈ బొటిక్‌ను లాంజీన్స్ ఫ్రెండ్ ఆఫ్ ది బ్రాండ్ సారా అలీ ఖాన్ ప్రారంభించారు. అనంతరం, ఆమె జూబ్లీ హిల్స్‌లోని బొటిక్‌ను సందర్శించి, కొంతమంది ఎంపిక చేసిన కస్టమర్లతో ముచ్చటించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా, బ్రాండ్ యొక్క సరికొత్త లాంజీన్స్ ప్రైమాలూనా కలెక్షన్ ను ప్రదర్శించడానికి ఇనార్బిట్ మాల్ లోని ఆట్రియం వద్ద ఒక ఫ్యాషన్ షోను నిర్వహించారు. సారా అలీ ఖాన్ తన సహజమైన ఆకర్షణ మరియు హుందాతనంతో, ఈ కలెక్షన్‌లోని తనకు ఇష్టమైన ప్రైమాలూనా మోడల్‌ను ధరించి స్టైల్‌గా ర్యాంప్‌పై నడిచారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ, సౌందర్యం అనేది కాలాతీతమైనదిగా అభివర్ణించారు. ఈ సిద్దాంతమే, లాంజీన్స్ కు అంతర్లీనంగా ఉందని పేర్కొన్నారు. నిజమైన సొగసు ప్రాథమికంగా కాలాతీతంగా ఉంటూనే, కాలక్రమేణా పరిణామం చెందుతుందనే బ్రాండ్ యొక్క తత్వాన్ని ఇది ప్రతిబింబిస్తుందని చెప్పుకొచ్చారు.
దీని మొదటి వెర్షన్ స్ఫూర్తితో, సున్నితమైన కేస్ నిష్పత్తులు, మూన్‌ఫేజ్ కాంప్లికేషన్‌లోని సరికొత్త తేదీ ప్రదర్శన నుండి రత్నాలను పొదిగే పద్ధతులలోని నైపుణ్యం వరకు ప్రతి అంశం ఆలోచనాత్మకంగా రూపొందించబడింది. ఈ కళాత్మక నైపుణ్యం ఒక అసాధారణమైన నమూనాలో అభిరుచి ఉన్న కస్టమర్ల కోసం తీర్చిదిద్దినట్టు లాంజీక్స్ ప్రతినిధులు వెల్లడించారు. దీనిలో నీలిరంగు మదర్-ఆఫ్-పెర్ల్ డయల్ ఉంటుందనీ, దాని చుట్టూ జాగ్రత్తగా ఎంపిక చేసిన 48 నీలమణులతో అలంకరించబడిన బెజెల్ ఉంటుందని తెలిపారు.. ఇవన్నీ కలిసి స్విస్ గడియారాల కళాత్మకత నైపుణ్యానికి నిదర్శనంగా చెప్పుకొచ్చారు. ఇనార్బిట్ మాల్‌లోని లాంజీన్స్ బొటిక్, లాంజీన్స్ వినియోగదారులకు అత్యంత ఇష్టమైన గమ్యస్థానాలలో ఒకటిగా నిలువనుందని అంచనా వేశారు. బ్రాండ్ యొక్క ప్రపంచాన్ని ప్రతిబింబిస్తూ, ఇది మహిళలకు ఎంతో ఇష్టమైన సరికొత్త డిజైన్ల కలెక్షన్లను పరిచయం చేస్తోందని తెలిపారు.






