calender_icon.png 4 July, 2025 | 10:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశ రక్షణలో సైనికుల పాత్ర గొప్పది

27-10-2024 06:10:23 PM

గజ్వేల్ (విజయక్రాంతి): దేశ రక్షణలో సైనికుల పాత్ర గొప్పదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఆదివారం గజ్వేల్ పట్టణంలో ఆజాద్ డిఫెన్స్ అకాడమీ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ యువతను ప్రోత్సాహం అందిస్తున్న అకాడమీ సభ్యులను రఘునందన్ రావు అభినందించారు. దేశ రక్షణ కోసం యువత ముందుకు రావాలని అన్నారు. యువత దేశాన్ని కాపాడడానికి ఆర్మీ, బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్ కు పంపించాలంటే కుటుంబ సభ్యులు భయపడుతున్నారని అన్నారు. దేశ రక్షణే ప్రథమ కర్తవ్యంగా భావించే సైనికులతో మనమంతా సురక్షితంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆజాద్ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ నీల చంద్రం, డైరెక్టర్ షఫీ, మాజీ సైనిక ఉద్యోగులు, బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.