2 May, 2026 | 10:38 PM

రూపాయి చెల్లదు!

14-03-2025 12:56 AM
  1. బడ్జెట్ ప్రతుల్లో రూపాయి గుర్తును తొలగించిన తమిళనాడు ప్రభుత్వం
  2. ఈసారి తమిళ అక్షరంతో భర్తీ
  3. సీఎం స్టాలిన్‌పై మండిపడ్డ బీజేపీ నేత అన్నామలై

చెన్నై, మార్చి 13 : తమిళనాడు-కేంద్రం మధ్య నడుస్తోన్న భాషా వివాదం మరో మలుపు తీసుకుంది. హిందీని అనవసరంగా రుద్దుతున్నారని కేంద్రంపై గుర్రుగా ఉన్న తమిళ ప్రభుత్వం ఈ ఏడాది ప్రవేశపెట్టబో యే బడ్జెట్ పుస్తకాల నుంచి రూపాయి గుర్తు ను తీసేసి, ‘రూబాయి’ అనే తమిళ అక్షరం తో భర్తీ చేసింది.

శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ కాపీలను ముఖ్యమంత్రి స్టాలిన్ ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఈ ప్రతు ల్లో రూపాయి గుర్తు లేదు. 2010లో అప్పటి యూపీఏ ప్రభుత్వం రూపాయి గుర్తు కొరకు దేశవ్యాప్తంగా పోటీలు నిర్వహించగా.. డీఎం కే మాజీ ఎమ్మెల్యే కుమారుడు తిరు ఉదయ్‌కుమార్ డిజైన్ చేసిన రూపాయి గుర్తు ఎంపికైంది.

ఈఘనత సాధించినందుకు అప్పట్లో అందరూ అతడిని మెచ్చుకున్నారు. తమిళ ప్రభుత్వం ఇలా రూపాయి గుర్తును తొలగించడంపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఘాటుగా స్పందించారు. 

గత బడ్జెట్లలో కనిపించినా.. 

హిందీలో ఉన్న రూపాయి గుర్తు తమిళనాడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన గత బడ్జెట్ పుస్తకాల్లో కనిపించింది. ఈసారి మాత్రం ఆ గుర్తు స్థానంలో తమిళ అక్షరాన్ని చేర్చారు. దేశ కరెన్సీ గుర్తును తీసేసిన మొదటి రాష్ట్రం తమిళనాడు కావడం గమనార్హం. ప్రస్తుతం జాతీయ విద్యావిధానం విషయంలో తమిళ ప్రభుత్వానికి కేంద్రానికి మధ్య వైరం నడుస్తోంది. ఇలా చేయడంపై డీఎంకే అధికార ప్రతినిధి శరవణన్ స్పందించారు. ‘రాష్ట్రం అధికారిక రూపాయి గుర్తును తిరస్కరించడం లేదు. తమిళ భాషను మరింత ప్రో త్సహించేందుకే ఇలా చేశాం’ అని తెలిపారు. 

మండిపడ్డ అన్నామలై.. 

రూపాయి గుర్తును తొలగించడాన్ని  అ న్నామలై తప్పుబట్టారు. ఒక తమిళ వ్యక్తి డి జైన్ చేసిన రూ పాయి గుర్తును తమిళనాడు ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. డీఎంకే నేత కొడుకు తిరు రూపొందించిన గుర్తును వాడకపోవడం  స్టాలిన్ మూర్ఖత్వానికి నిదర్శనం అని విమర్శించారు. 

నాలుకలు కట్ చేస్తాం జాగ్రత్త: మంత్రి దురై మురుగన్

ఎవరైనా తమిళాన్ని తక్కువ చేసి మాట్లాడితే వారి నాలుకలు కత్తిరిస్తామని తమిళనా డు మంత్రి దురై మురుగన్ హెచ్చరించారు. ఉత్తరాదిలో ఒక మహిళ ఏకంగా 10 మంది పురుషులను పెళ్లి చేసుకునే వెసులుబాటు ఉందన్నారు. ‘తమిళ సంస్కృతిలా కాకుండా బహుభార్యత్వం అనేది ఉత్తరాదిలో సాధార ణం. ఒక వ్యక్తి ఒకే స్త్రీని పెళ్లాడని మన సం  ఉంది.

కానీ ఉత్తరాదిన మాత్రం ఒ క్క స్త్రీ ఐదుగురు లేదా పది మంది పురుషు ల్ని వివాహం చేసుకుంటుంది. అది వారి సంస్కృతి. ఒకరు పోతే మరొకరు వస్తారు. ఒక స్త్రీ ఒకరి కంటే ఎక్కువ మంది పురుషులను వివాహం చేసుకోవచ్చని మహాభార తంలోనే ఉంది. ద్రౌపది ఐదుగురు పాండవులను వివాహం చేసుకుంది.’ అని  అన్నా రు.

డీలిమిటేషన్ విషయంపై స్పందిస్తూ.. ‘కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా జనాభాను నియంత్రించమని మాకు చెప్పా రు. మేము దాన్ని సక్రమంగా నిర్వర్తించడం వల్ల జనాభా తగ్గింది. ఉత్తరభారతదేశంలో జనాభా తగ్గలేదు. వారు 17,18, 19 మంది పిల్లలను కూడా కన్నారు. వారికి కనడం తప్ప వేరే పనేం లేదు’ అని మంత్రి అన్నారు. 

ప్రమాదకర మనస్తత్వం: నిర్మల

తమిళనాడు బడ్జెట్ ప్రతులపై రూపాయి గుర్తును తొలగించి తమిళ గుర్తును వాడటంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పం దించారు. ‘ఇది ప్రమాదకర మనస్తత్వం. ప్రాంతీయ దురాభిమానానికి ఇది పరాకాష్ట. భారతీయ ఐక్యతను బలహీనపరిచే వేర్పాటువాద భావాలను ప్రోత్సహించేదిలా ఉంది’ అని అన్నారు.

రూపాయి అనే పదానికి ఎంతో చరిత్ర ఉందన్నారు. ‘2010 లో రూపాయి గుర్తును యూపీఏ ప్ర భుత్వం తీసుకొచ్చినపుడు డీఎంకే ఎందుకు నిరసన తెలియజేయలేదు. డీఎంకే పార్టీ కేవలం జాతీయ చిహ్నా న్ని మాత్రమే తిరస్కరించలేదు. తమి ళ యువత సృజనాత్మకతను కూడా తిరస్కరించింది’ అని అన్నారు.