27 July, 2026 | 6:08 PM

Breaking News

ఐదెకరాల ప్రభుత్వ భూమి కబ్జా..   •   బీజిలిపూర్ ఎస్సీకాలనీ కరెంట్ సమస్య పరిష్కరించరా?   •   అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   భాగీరథిపల్లిలో రూ.25 లక్షల కల్వర్టు నిర్మాణానికి భూమిపూజ   •   ఇల్లందు ఏరియాలో సింగరేణి ఉద్యోగులకు క్వార్టర్ల కౌన్సిలింగ్ నిర్వహణ   •   నేరేడుచర్లలో భాజపా ఆధ్వర్యంలో " సర్" ప్రక్రియపై సమీక్ష   •   రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి   •   ఎక్స్‌టార్షన్‌కు పాల్పడిన నిందితులు అరెస్ట్.. రిమాండ్   •   తొలిముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ కంచర్ల హిమశ్రీ   •   ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాలి   •  

పోలీసు అమరవీరుల త్యాగం చిరస్మరణీయం

29-10-2025 12:00 AM

మల్కాజిగిరి డీసీపీ పద్మజారెడ్డి

ఘట్ కేసర్, అక్టోబర్ 28 : ప్రజల రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగం చిరస్మరణీయమని మల్కాజి గిరి డీసీపీ పద్మజరెడ్డి అన్నారు. ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి ఎన్ ఎఫ్ సి నగర్ లోని సాయి సందీప్ కాలనీకి చెందిన విధినిర్వహణలో ప్రాణాలు అర్పించిన గ్రేహౌండ్స్ పోలీ స్ తిక్క సందీప్ నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ప్రజల కోసం తమ ప్రాణాలు అర్పించిన త్యాగమూర్తుల సేవలు ఎప్పటికి మర్చిపోలేనివని పేర్కొన్నారు. తిక్క సందీప్ కుటుంబాన్ని పోలీస్ శాఖ అన్ని రకాలుగా ఆదుకుని అండగా ఉంటుందన్నారు. ఎలాంటి ఇబ్బంది వచ్చినా నేరుగా సంప్రదించాలన్నారు.

ఈ సందర్భంగా తిక్క సందీప్ భార్య పావని, తల్లి శోభ లను శాలువాలతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈకార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, మల్కాజిగిరి ఏసీపీ చక్రపాణి, ఘట్కేసర్ ఇన్‌స్పెక్టర్ ఎం. బాలస్వామి, పోచారం ఐటీ కారిడార్ ఇన్ స్పెక్టర్ రాజువర్మ, ఎస్‌ఐలు ప్రభాకర్‌రెడ్డి, శేఖర్, రాఘ వేంద్ర,  స్థానిక నాయకులు పాల్గొన్నారు.