29-10-2025 12:00:00 AM
కొల్చారం, అక్టోబర్ 28 :ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం సద్వినియోగం చేసుకుని రైతులు గిట్టుబాటు ధర పొందాలని డీసీఎంఎస్ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు, రంగంపేట సహకార సంఘం అధ్యక్షులు అరిగే రమేష్ అన్నారు. మంగళవారం మండలంలోని పైతరలో రంగంపేట సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కొనుగోలు కేంద్రానికి నిర్ణయించిన తేమ శాతం ఉన్న ధాన్యా న్ని రైతులు తీసుకురావాలని, ధాన్యం తు ర్పార బడితే తరుగు ఉండదని అన్నారు. ఈ సందర్భంగా రైతులు ప్రతి ఏటా లారీల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు మురళి గౌడ్, భాను ప్రకాష్ రెడ్డి, ఎల్లయ్య, సహకార సంఘం డైరెక్టర్ జీవన్, సహకార సంఘం సీఈవో నవీన్, సిబ్బంది బీరప్ప, దుర్గేష్,నరేష్, నాయకులు షాదుల్లా, బసారం యాదగిరి పాల్గొన్నారు.