06-12-2025 09:05:51 PM
కాంగ్రెస్ కి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదు..
ఆరు గ్యారంటీలతో ప్రజలను నిండా మోసం చేశారు.
మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ
గద్వాల: గ్రామాల్లో అభివృద్ధి జరిగింది అంటే.. కేవలం కేంద్రం నిధులతో తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి పైసా నిధులు రాలేదని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. శనివారం జిల్లా కేంద్రం లోని డి కే బంగ్లా లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలంగాణ ప్రజలను బ్రహ్మాండంగా మోసం చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలు చేసుకుంటుందని గత ప్రభుత్వం సర్పంచ్ లతో పనులు చేయించి బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా ఆ బిల్లులు చెల్లించలేదని ఇంకా అధికారుల చుట్టూ సర్పంచులు చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కూడా రూపాయి కూడా విడుదల చేయలేదని స్వయాన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిధులు లేక రూ.లక్ష పనికూడా చేయలేక పోతున్నాం అంటున్నారు. గ్రామాల అభివృద్ధికి నిధులు ఇచ్చేది మోదీ సర్కార్ అని గ్రామాల్లో రోడ్లు గుంతలు పడి ఉన్న పట్టించుకోవడం లేదన్నారు.
అభివృద్ధి కోసం అధికార పార్టీలోకి వెళ్ళామని ఎమ్మెల్యే అంటున్నారని నియోజకవర్గం అభివృద్ధి కోసం అధికార పార్టీకి వెళ్లారా..? లేక పోతే సొంత ప్రయోజనాల కోసం వెళ్ళరా అనేది ప్రజలకు తెలుసునని గతంలో ఉన్నది అధికార పార్టీనే కదా.. చేసిన అభివృద్ది ఏంటి.? అని ఆమె ప్రశ్నించారు. మేము ప్రారంభించిన నెట్టెంపాడు, గట్టు లిఫ్ట్ లను రెండు టర్ములు అయిన పూర్తి చేయలేదని గట్టు లిఫ్ట్ పూర్తి కావాలంటే ఇంకా ఆరునెలలు కావాలని అంటున్నారన్నారు.
జూరాల ప్రాజెక్ట్ లో మెయింటనేన్స్ లేదు ..
జూరాల ప్రాజెక్ట్ ను కాపాడాలంటే.. సమాంతరంగా సేఫ్టీ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ఇటీవల వచ్చిన వరదలకు జూరాల ప్రాజెక్ట్ గేట్లు మొరాయించడం, పగుళ్లు వచ్చాయని వార్తలు వచ్చాయని వెంటనే ప్రాజెక్ట్ సేఫ్టీ కోసం ఇరిగేషన్ బ్రిడ్జి కట్టకుండా ఆర్ అండ్ బి బ్రిడ్జి గా మార్చారని ఎవరి ప్రయోజనాల కోసం మారుస్తున్నారని ఆమె ప్రశ్నించారు. జూరాల ప్రాజెక్టు కు భవిష్యత్ లో నష్టం జరిగితే.. పూర్తి బాధ్యత సీఎం వహించాల్సి ఉంటుందని జూరాల ప్రాజెక్ట్ సేఫ్టీ బ్రిడ్జి వెంటనే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వన్నీ విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
రేవుల పల్లె వద్ద వెంటనే ప్రాజెక్ట్ సేఫ్టీ బ్రిడ్జి కట్టాలి
ప్రాజెక్ట్ సేఫ్టీ కోసం బ్రిడ్జి ఎక్కడ కట్టాలో అక్కడ కట్టాలని అందుకు నిపుణుల కమిటీ వేయాలని ప్రాజెక్ట్ సేఫ్టీ కోసం కడుతున్న బ్రిడ్జి ఆ.. లేక ట్రాన్స్పోర్ట్ కోసం కడుతున్న బ్రిడ్జి ఆ చెప్పాలన్నారు.
కేంద్రం నుంచి నిధులు తీసుకువస్తా
గ్రామాల అభివృద్ధి బీజేపీ తోనే సాధ్యం మని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ మద్దతుదారులను గెలిపిస్తే.. ఆయా గ్రామాల అభివృద్ధికి కేంద్రం నుండి నిధులు తీసుకొని వస్తానని అందుకు సాయశక్తుల ప్రయత్నం చేస్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి పూర్తిగా అమలు చేయలేదని పెన్షన్ పెంచలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, ఎలక్ట్రికల్ స్కూటీలు, మహిళలకు చేయూత 2500 ఇవ్వలేదు, తులం బంగారం ఏది అమలు చేయలేదని కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి.. ప్రజలను మోసం చేశారన్నారు.
వికసిత్ భారత్ 2047 లక్ష్యం తో ప్రధాని నరేంద్ర మోదీ పని చేస్తున్నారని ఆమె వివరించారు. ప్రజలు బీజేపీకి మద్దతు ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని, తెలంగాణలో భవిష్యత్ లో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజానీకం, యువత కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, జిల్లా యువ నాయకురాలు డికె.స్నిగ్ద రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి ,రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ బండల వెంకట రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యామ్ రావ్,అసెంబ్లీ కి పోటీ చేసిన అభ్యర్థులు శివారెడ్డి ,రాజగోపాల్, పట్టణ అధ్యక్షురాలురజక జయశ్రీ, జిల్లా మహిళ మోర్చా అధ్యక్షురాలు సమత మధు గౌడ్, తదితరులు ఉన్నారు.