వచ్చే ఎన్నికల్లో పాలమూర్ పార్లమెంట్ జనసేనదే
- ఆగస్టు 1 న జనసేన పార్లమెంట్ స్థాయి సమావేశం
- రాజకీయం చేసేందుకు డబ్బులు ముఖ్యం కాదు
- ప్రజాసేవ చేసేందుకు రాజకీయం లోకి వచ్చాను
- విలేకరుల సమావేశం పాలమూర్ పార్లమెంట్ జనసేన అభ్యర్థి రామకృష్ణ
మహబూబ్ నగర్ (విజయక్రాంతి) : కారు కూతలు కాదు.. అందరి కడుపు నింపే స్థాయి లో జనసేన అడుగులు వేస్తుందని జనసేన పార్లమెంట్ అభ్యర్థి రామకృష్ణ, నాయకులు రామకృష్ణ లక్ష్మణ్ గౌడ్ అన్నారు. శుక్రవారం నగరం లో సింధు హోటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రజ సమస్యల పట్ల ఎల్లప్పుడు జనసేన పార్టీ ముందు ఉంటుందన్నారు. ఈ ప్రభుత్వం ఇచ్చిన 6గ్యారంటీ లతో పాటు ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టేలా పోరాటం చేస్తామని పేర్కొన్నారు. వచ్చే నెల 1వ తేదీన పార్లమెంట్ స్థాయి సమావేశం జరిగిందన్నారు.
నగరం లో 18 స్థానాల్లో కార్పొరేటర్, కౌన్సిలర్ లకు పోటీ చేయడం జరిగిందన్నారు. మునుముందు జనసేన మొదటి స్థానం లో ఉంటుందన్నారు. కొత్త వారికి పార్టీ లో మంచి స్థానం ఉంటుందన్నారు. త్వరలోనే ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని, అందరికి అందుబాటులో ఉంటామన్నారు. అమరవీరుల స్తూపం నుంచి భారీ ర్యాలీ చేస్తామని, అనంతరం సభ ఉంటుందన్నారు. ఈ సమావేశం నికి జనసేన రాష్ట్ర నేతలు వస్తారని పేర్కొన్నారు. ఈ సమావేశం లో జనసేన పార్టీ నాయకులు రఘు, రవీందర్ గౌడ్,కృష్ణ, మణికంఠ, శ్రీవల్లి తదితరులు ఉన్నారు.






