calender_icon.png 10 January, 2026 | 8:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్పంచ్‌ల విన్నపం.. ఎమ్మెల్యే సానుకూల స్పందన

09-01-2026 12:00:00 AM

బిచ్కుంద, జనవరి 8 (విజయ క్రాంతి): పిట్లం మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు  పాల్గొన్నారు.ఈ సందర్భంగా పిట్లం మండలానికి చెందిన వివిధ గ్రామాల సర్పంచులు తమ తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే  దృష్టికి తీసుకువచ్చారు.గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు, విద్యుత్ సబ్స్టేషన్లు, విద్యుత్ స్తంభాలు, త్రాగునీటి సౌకర్యం, రహదారులు, కాంపౌండ్ వాల్స్, పాఠశాల భవనాలు, డ్రైనేజీ వ్యవస్థ వంటి మౌలిక వసతులను కల్పించాలని సర్పంచులు కోరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు  మాట్లాడుతూ..గ్రామాల్లో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు తాను పూర్తిస్థాయిలో కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా సర్పంచులు చొరవ చూపాలని చెప్పారు.అలాగే సర్పంచులు అందరూ ప్రజల సేవలో భాగస్వాములై, గ్రామాభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే  సూచించారు.