calender_icon.png 22 January, 2026 | 2:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శమ్నాపూర్ ఘటనపై స్పందించిన ఎస్సీ కమిషన్

18-09-2024 12:23:00 AM

ఎస్పీకి నోటీసు జారీ

మెదక్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): శమ్నా పూర్ గ్రామంలో వినాయకుడికి కొబ్బరికాయ కొట్టడానికి వెళ్లిన దళిత మహిళలను అవమానపరిచిన ఘటనపై దళిత బహుజన ఫ్రంట్ సోమవారం జాతీయ ఎస్సీ కమిషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇందుకు స్పం దించిన కమిషన్.. ఎస్పీకి నోటీసు జారీ చేసిందని సంఘం జిల్లా అధ్యక్షుడు సంజీవ్ తెలిపారు.