కొలంబియాలో కూలిన సైనిక విమానం
24-03-2026 12:48 AM
౪౫ మంది సైనికుల దుర్మరణం!
బొగోటా, మార్చి 23 : పెరూ సమీపంలో 110 మంది సైనికులతో వెళ్తున్న కొలంబియా సైనిక విమానం దగ్ధమైంది. ఈ విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే ఈ ఘటన జరిగింది. ఎంతమంది మరణించారో, గాయపడ్డారో అనే విషయాన్ని అధి కారులు ఇంకా ధ్రువీకరించలేదు. దాదాపు 45 మంది సైనికుల వరకు మృతిచెందినట్లు సమాచారం.
కొలంబియా దేశంలోని మా రుమూల దక్షిణ అమెజాన్ ప్రాంతంలో 110 మంది సైనికులతో వెళ్తున్న కొలంబియా సైనిక విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. విమాన శిథిలాల నుంచి సుమారు 57 మందిని ప్రాణాలతో బయటకు తీశారు. ఈ సంఘటనపై అధ్యక్షుడు గుస్తావో పెట్రో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్‌లో ఒక పోస్టు పెట్టారు. ‘ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని నేను ఆశిస్తున్నాను’ అని పేర్కొన్నారు.




