15 June, 2026 | 2:46 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

పొదల్లోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు

04-09-2024 12:32 AM

విద్యార్థులకు గాయాలు

చేవెళ్ల, సెప్టెంబర్ 3: చేవెళ్ల మండలంలోని ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది. చిన్నారులను పరిమితికి మించి ఎక్కించుకోవడం, డ్రైవర్ నిర్లక్ష్యమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మండల కేంద్రంలో సిల్వర్ డేల్ స్కూల్ బస్సు మంగళవారం జాలాగూడ, గుండాల, అల్లవాడ, పామెన, ఇక్కరెడ్డి గూడ, చన్‌వెల్లి, బస్తేపూర్ తదితర గ్రామాలకు చెందిన 60 మంది విదార్థులను ఎక్కించుకొని స్కూల్‌కు బయల్దేరింది. ఇక్కడెడ్డిగూడ వద్దకు రాగానే అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో పలువురు విదార్థులకు గాయాలు కాగా.. స్థానికులు వారిని రక్షించారు. గాయపడిని చిన్నారులను పోలీసులు చేవెళ్ల ప్రభు త్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నా రు. పామెన గ్రామానికి చెందిన ఓ బాలికకు తీవ్రగాయాలు కాగా ఆమె తల్లిదండ్రులు వెంటనే పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం పాప కండిషన్ క్రిటికల్‌గా ఉందని డాక్టర్లు తెలిపారు. మరోవైపు స్కూల్ బస్సు పొదల్లోకి దూసుకెళ్లడంపై పేరెంట్స్ ఆందోళనకు దిగారు. పిల్లలను పరిమితికి మించి ఎక్కించుకోవద్దని మేనేజ్‌మెంట్‌కు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.