15 June, 2026 | 1:09 PM

Breaking News

మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •   ఆలయంలో గుప్తనిధుల వేట.. ప్రాచీన శివాలయం ధ్వంసం   •   భట్టి విక్రమార్కకు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ   •   నేషనల్ టాలెంట్ హంట్ పోస్టర్లు విడుదల చేసిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్   •   విద్యార్థుల కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులు   •   ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకం.. విద్యార్థులకు టిఫిన్ తినిపించిన మంత్రి పొన్నం   •   విద్యుత్ షాక్ తో రైతు మృతి   •   ప్రైవేటీకరణపై.. కొత్త గనుల కోసం కొట్లాడుదాం   •   యుద్ధం ముగిసింది.. ఇంజిన్లు స్టార్ట్ చేయండి.. ట్రంప్ కీలక ప్రకటన   •   మైనర్ల రక్షణలో మహిళా పోలీసుల పాత్ర అత్యంత కీలకం   •  

బాగా చదువుకోవాలని తండ్రి మందలించడంతో..

04-09-2024 12:36 AM
  1. మనస్తాపానికి గురై కూతురు ఆత్మహత్య 
  2. మెదక్ జిల్లా తూప్రాన్ ఘటన 
  3. ఒంటరితనం భరించలేక వృద్ధురాలు..

వెల్దుర్తి, సెప్టెంబర్ 3: బాగా చదువుకోవాలని తండ్రి మందలించాడని విద్యార్థిని ఆత్మ హత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా తూప్రాన్‌లో చోటుచేసుకుంది. తూప్రాన్ పరిధిలోని ఆబోతుపల్లికి చెందిన నక్కపల్లి మహేం దర్.. కూతురు శృతి (15) పదవ తరగతి చదువుతోంది. కొద్దిగా చదువులో వెనుక బడిన శృతిని శ్రద్ధగా చదువుకోవాలని మందలించి మంగళవారం ఉదయం తండ్రి మహేందర్ గేదెలు మేపేందుకు వెళ్లాడు. తండ్రి మాటలతో మనస్తాపానికి గురైన శృతి ఇంట్లో ఉరే సుకొని ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రం తండ్రి ఇంటికి వచ్చి చూడగా శృతి ఉరివేసుకొని ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేర కు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

మాసాయిపేటలో ఓ వృద్ధురాలు...

ఒంటరితనం భరించలేక వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుంది. వెల్దుర్తి మండలం మాసాయిపేట గ్రామానికి చెందిన గౌరగల్ల పెంటమ్మ (63) కుమారుడు ఉన్నప్పటికీ ఒంటరి జీవితం గడుపుతోంది. తోడు ఎవరూ లేకపోవడంతో మనస్తాపానికి గురై ఆగస్టు 31న పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఇరుగుపొరుగు వారు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న పెంట మ్మ మంగళవారం మృతి చెందింది. ఆమె కుమారుడు అశోక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చేగుంట ఎస్‌ఐ తెలిపారు.