17 April, 2026 | 3:09 AM

పాఠశాల అద్భుతం.. నిర్మాణ స్థలం కాలుష్యం!

17-04-2026 01:09 AM
  1. విద్యార్థులకు చేస్తే మేలు చేయండి 

కాలుష్యం ప్రాతంలో నిర్మాణం సరికాదు 

ఆ ప్రాంతంలో వద్దంటూ సంతకాల సేకరణకు శ్రీకారం 

ఆపేదాకా పోరాడుతాం...కోట రాములు

చిన్నచింతకుంట ఏప్రిల్ 16 : ఒక ప్రభు త్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఒక నూ తన అధ్యయనానికి శ్రీకారం చుట్టడం ఆనవాయితీగా వస్తుంది. ఈ తరుణంలోనే గత ప్రభుత్వం గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయగా ప్రజా పాలన ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ఏర్పాటుకు శ్రీకారం చు ట్టింది. ఈ తీపి కబురు విన్న పేద తల్లిదండ్రుల విద్యార్థులు తెగ సంబరపడిన దేవర కద్ర నియోజకవర్గంలోని ఎమ్మెల్యే సొంత గ్రామం దమగ్నాపూర్ లో ఇంథనాల్ ఫ్యాక్ట రీ ఉండడంతో కాలుష్యం వెదజల్లుతుందని

ఈ ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల వద్దం టూ అక్కడ కొంతమంది స్థానికులు, బీఆర్‌ఎస్ నాయకులు సంతకాల స్వీకరణకు శ్రీక రం చుట్టారు. పాఠశాల రావడం అద్భుతం అని రాకపోకలకు ఇబ్బందులతో పాటు 2500 మంది చదివే సుదూర ప్రాంతంలో ఏర్పాటు చేయడంతో పాటు పొల్యూషన్ ఉ న్న స్థలాన్ని ఎంపిక చేయడం విడ్డూరంగా ఉందంటూ అక్కడ కొంతమంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

 ఆరోగ్యం బాగుంటేనే.. అద్భుతమైన జీవితం..

 విద్యార్థులకు మంచి చదువు అందించే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ పా ఠశాల నిర్మాణం కాలుష్య ప్రాంతంలో కా కుండా విద్యార్థులకు చదువుతోపాటు సం పూర్ణ ఆరోగ్యం అందించే స్థలంలో నిర్మిస్తే బాగుంటుందని ఆ ప్రాంతవాసులు చెబుతు న్న మాట. భవిష్యత్తులో విద్యార్థులకు ఏదై నా జరగరానిది జరిగితే పాఠశాలను అప్పటికప్పుడు అక్కడి నుంచి మార్చే ప్రసక్తి ఉం డదని కోట్లాది రూపాయలను ఖర్చుపెట్టి ఇక్కడ నిర్మాణం చేయడం సరైన పద్ధతి కా దంటూ ఆయా మండల పరిధిలోని గ్రామాలలో బీఆర్‌ఎస్ నాయకులతో పాటు మరికొంతమంది సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టారు. దేవరకద్ర నియోజకవర్గ కేంద్రం లో ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఏర్పాటు చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కొం తమంది ప్రజలు చెబుతున్న మాట. 

 కాలుష్య ఉంటే చదువు సాగేది ఎట్లా...

 ఇప్పటినుంచి ఆ ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఓ కంపెనీ కాలుష్య వెదజల్లే ప్రాంతంలో కొలువుతీరిందని ప్రచారం రూపండుకోవడంతో ఆ పాఠశాలలో విద్యార్థులను చేర్పిం చేందుకు కూడా చాలామంది ఆసక్తి చూపని పరిస్థితులు ఎలా ఉంటాయని మరి కొంతమంది చెబుతున్న మాట. ఇప్పటికైనా ప్రభు త్వ పెద్దలు పూర్తిస్థాయిలో సమగ్ర ఆలోచన చేసి ఇంటిగ్రేటెడ్ పాఠశాల కోట్ల రూపాయలను ఖర్చు చేసి నిర్మించడంతో పునర్ ఆలో చించి ముందుకు అడుగులు వేస్తే విద్యార్థులకు మంచి భవిష్యత్తుతో పాటు ఉన్నత చ దువులు అందించిన ప్రజా పాలన ప్రభుత్వముగా చిరస్థాయిగా నిలుస్తుందని పలువు రు పేర్కొంటున్న మాట. ఈ విషయంలో అధికార ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. 

 ఆపేదాకా పోరాడుతాం...కోట రాములు

 నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నేర్పించడం మంచి విషయమని బీఆ ర్‌ఎస్ మండల అధ్యక్షులు కోట రాములు అన్నారు. గురువారం మండల పరిధిలోని పలు ప్రాంతాలలో ఫ్యాక్టరీ పక్కన పాఠశాల వద్దంటూ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమీపంలోని కెమికల్ ఫ్యాక్టరీ నుంచి వస్తున్న చెడు రసాయనాల ప్రభావంతో పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని బిఆర్‌ఎస్ మండల అధ్యక్షులు కోట రాములు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యావేత్తగా, సామాజిక అవగాహన ఉన్న ఎమ్మెల్యే ఈ అంశాన్ని పునఃపరిశీలించి ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలని కోరారు. 

ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కోట రాములు, మండల నాయకులు రాము, సంతోష్ రెడ్డి, పర్ధీపూర్ గ్రామ బిఆర్‌ఎస్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, స్వామి, చర్లపల్లి గోవిందు, కెసిఆర్ నర్సింహ, తెలుగు నర్సింహ, పెద్ద బాల రాజు గౌడ్, చాకలి శంకర్ తో పాటు పలువురు ఉన్నారు.