calender_icon.png 16 December, 2025 | 12:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీ బందోబస్తు నడుమ ఎన్నికలు

15-12-2025 12:00:00 AM

బెల్లంపల్లి, డిసెంబర్ 14 : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజక వర్గంలో రెండో విడత ఎన్నికలు భారీ బందోబస్తు మధ్య జరిగాయి. ఏడు మండలాల్లోనీ బెల్లంపల్లి, తాండూర్, కాసిపేట, నేన్నెల, కన్నేపల్లి, బీమి నీ, వేమనపల్లి మండలాల్లో పోలీస్ ఎన్నికల అధికారులు సుడిగాలి పర్యటన చేశారు. జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి కుమార్ దీపక్, రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా, ఎన్నికల జిల్లా ఎన్నికల ఉపాధికారి చంద్రయ్య, మంచిర్యాల డీసీపీ భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ నియోజవర్గంలోని అన్ని మండలాల్లో పర్యటించారు.

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు కట్టుదిట్టమైన బందోబస్తును నిర్వహించారు. నియోజవర్గంలోని ఎన్నికల నిర్వహణ కో సం ఏర్పాటుచేసిన 996 పోలింగ్ కేంద్రాలను విజిట్ చేశారు. సమస్యాత్మకంగా గుర్తించిన 30 పోలింగ్ కేంద్రాలను సైతం పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద బలగాలు బందోబస్తు నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగిసా యి.

పోలింగ్ కేంద్రాల్లోనే ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నికల అధికారులు పోలీసు ఉన్నత అధికారులు నియోజ వర్గంలో ప్రధానంగా దృష్టి సారించారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో ఉన్నతాధికారుల  పర్యటనలు ఎన్నికల ప్రశాంతంగా  జరిగేందుకు ఎంతగానో దోహదపడ్డాయి.

నియోజవర్గంలోని మార్మూల గ్రామాలు గుండ్ల సోమవారం, వేమనపల్లి, చిత్తాపూర్ కాస్పేట తాండూరు మండలాల శివారు ప్రాంతాల్లో కూడా పోలీసు ఉన్నతాధికారులు పర్యటించారు. ఏదేమైనా ఎన్నికలు ప్రశాంతంగా జరగడంతో అటు పోలీసులు, ఇటు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.