calender_icon.png 12 December, 2025 | 2:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విత్తన బిల్లును ఆపేయాలి

12-12-2025 02:21:42 AM

  1. రైతు వ్యతిరేక కేంద్ర ప్రభుత్వ  ప్రతిపాదనను తిరస్కరిస్తున్నాం
  2. ఇందులో కార్పొరేట్ ప్రయోజనాలకే పెద్దపీట 
  3. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు

హైదరాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి) : కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న విత్తన బిల్లు డ్రాఫ్ట్‌ను బీఆర్‌ఎస్ వ్యతిరేకిస్తున్నదని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ విత్తన బిల్లు వల్ల రైతన్నలకు తీవ్రమైన నష్టం జరుగుతుందని తెలిపారు. అందుకే కేంద్ర ప్రభు త్వం ప్రతిపాదిస్తున్న ఈ బిల్లును పూర్తిగా ఆపివేసి, రైతన్నలతో, రైతు సంఘాలతో, నిపుణు లతో, రాజకీయ పార్టీలతో చర్చ చేసిన అనంతరం ఈ బిల్లు అంశంపై ముందుకు పోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం తన ‘ఎక్స్’లో పోస్టు చేశారు.

ముఖ్యంగా ఈ బిల్లులో నకిలీ విత్తనాలను కట్టడి చేసే అం శంపై స్పష్టత లేదని, నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతన్నలకు నిర్దిష్ట సమయంలోనే నష్టపరి హారం అందించే అంశంపై గ్యారంటీ లేదని పేర్కొన్నారు. దీంతో పాటు కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా విత్తనాల ధరలను నిర్ణయిం చే విధంగా నిబంధనలు ఉన్నాయని, గతంలా విత్తనాల ధరల నిర్ణయంపై రాష్ర్ట ప్రభుత్వానికి అధికారం లేకుండా పోతుందని స్పష్టం చేశారు.

మరోవైపు, నకిలీ విత్తనాలకు సం బంధించిన అంశంలో జాతీయస్థాయిలో ఆయా కంపెనీలను బ్లాక్‌లిస్ట్ చేయడం, భారీ పెనాల్టీలు, కఠిన జైలుశిక్ష వంటి అంశాలకు ఇందులో పెద్ద గా ఆస్కారం లేదని తెలిపారు. విదేశాల నుంచి నేరుగా ఆయా కంపెనీలు ఎలాంటి విత్తన ట్రయ ల్స్ లేకుండానే దేశంలో తమ విత్తనాలను అమ్ముకునే నిబంధనలు ఉన్నాయని పేర్కొన్నారు.

వీటి వల్ల దేశీయ విత్తన భద్రత, విత్తన సార్వభౌమత్వం ప్ర మాదంలో పడుతుందని హెచ్చరించారు. రైతే కేంద్రంగా ఉండే విత్తన బిల్లును రూపకల్పన చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని, ఈ అంశంలో ఈజ్ ఆఫ్ బిజినెస్ పేరుతో కార్పొరేట్ కంపెనీలకు ఆధిపత్యం అప్పగించే ప్రయత్నా లను పక్కన పెట్టాలని కేటీఆర్.. తమ పార్టీ తరఫున ప్రతిపాదించిన సవరణల్లో పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం కంపెనీల ప్రయోజనాల కోసం కాకుం డా రైతన్నల ప్రయోజనాలకు, వ్యవసాయ సంక్షేమ అభివృద్ధికి ఉపయోగ పడేలా అత్యంత పారదర్శకంగా, కఠినమైన నిబంధనలతో కూడిన విత్తన బిల్లును తీసుకురావాల్సిన అవసరం ఉందని కేటీఆర్ సూచించారు. త్వరలోనే ఈ అంశంపై మాజీ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డితో పాటు ఎంపీ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీ తరఫున ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి కేంద్రానికి మరిన్ని సూచనలు ఇస్తామని తెలిపారు.