20 March, 2026 | 11:32 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

అధికారుల సేవలు అభినందనీయం : కూకట్‌పల్లి ఎమ్మెల్యే

30-10-2024 06:07 PM

కూకట్‌పల్లి (విజయక్రాంతి): విధి నిర్వహణలో సమర్థవంతంగా పనిచేసి పదవీ విరమణ పొందుతున్న అధికారుల సేవలు అభినందనీయమని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కొనియాడారు. జిహెచ్ఎంసి మూసాపేట సర్కిల్ 23 ఉప కమిషనర్ రమేష్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ మల్లేశ్వర్రావు లు ఈనెల 31 న పదవీ విరమణ పొందుతున్న సందర్భంగా సర్కిల్ కార్యాలయంలో వారినీ శాలువాతో సత్కరించి వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ.. ఉద్యోగ జీవితం నుంచి విరమణ పొందినప్పటికీ సామాజిక సేవలను కొనసాగించాలని, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, కుటుంబానికి అధిక సమయం కేటాయించాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో కూకట్‌పల్లి ఉప కమిషనర్ కృష్ణయ్య, మాజీ కార్పొరేటర్ బాబురావు, బీఆర్ఎస్ నాయకులు ప్రభాకర్ తదితరులు, ఇతర అధికారులను సన్మానించారు.