20 March, 2026 | 9:55 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

సందడిగా.. ఈసీఐఎల్ నారాయణ కళాశాల క్రీడా పోటీలు

30-10-2024 06:25 PM

కాప్రా (విజయక్రాంతి): ఈసీఐఎల్ లోని నారాయణ జూనియర్ కళాశాలలో క్రీడా పోటీలు సందడిగా జరిగాయి. బుధవారం నారాయణ కళాశాల స్పోర్ట్స్ మీట్ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులను కళాశాల జిఎంకే శ్రీనివాస్ క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని, విద్యార్థులకు క్రీడలు మానసిక ప్రశాంతతను పెంపొందిస్తాయన్నారు. ఇక క్రీడా పోటీలు విద్యార్థులకు ఆటవిడుపుగా ఉంటాయన్నారు. విద్యార్థుల్లో సామాజిక స్పృహ పెంపొందించేందుకు పండుగలు, వాటి విశిష్టత తదితర అంశాలపై నారాయణ కళాశాల యాజమాన్యం అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల సైతం క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని ప్రతిభను కనబరుచుతున్నారని వెల్లడించారు. క్రీడా పోటీలు  అనంతరం పోటీల్లోని విజేతలకు బహుమతులను ప్రధానం చేసి ప్రోత్సహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపాల్ వేణు కుమార్ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.