23 August, 2026 | 2:32 AM

ఆర్‌బీవీఆర్‌ఆర్ సొసైటీ సేవలు అభినందనీయం

23-08-2026 12:00 AM
  1. అతిథులు భూపతిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి
  2. ఘనంగా రాజ బహద్దూర్ వెంకటరామారెడ్డి జయంతి వేడుకలు

నిజామాబాద్, ఆగస్టు 22(విజయక్రాంతి): స్థానిక ముబారక్‌నగర్ ఆర్‌బీ వీఆర్‌ఆర్ సొసైటీ పాఠశాలలో రాజ బహద్దూర్ వెంకటరామారెడ్డి 157వ జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్.భూపతిరెడ్డి, సీనియర్ అడ్వైకేట్, గౌరవ అతిథి కాట్‌పల్లి శ్రీనివాస్‌రెడ్డి, రిటైర్డ్ డిస్ట్రిక్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్, ట్రస్టీ చైర్మన్ ఎస్.నవీన్‌రెడ్డి, సొసైటీ అధ్యక్షులు ఎ.ప్రవీణ్‌రెడ్డి, కార్యదర్శి జి.వెంకట రమణరెడ్డి(రఘు), ట్రేజ రర్, ఆఫీస్ బేరర్స్, ఈసీ సభ్యులు, ఉపా ధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అతిథులు మా ట్లాడుతూ విద్యార్థులు కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి అని పేర్కొన్నారు. ఆర్‌బీవీఆర్‌ఆర్ సొసైటీ చేస్తున్న సేవలను వారు అభినందించారు. సొసైటీ అధ్యక్షులు మాట్లాడుతూ విద్యార్థులు గమ్యాన్ని ఏర్పరుచుకొని విజ యాన్ని పొందాలని సూచించారు.

వివిధ రంగాల్లో ప్రతిభ ప్రదర్శించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను సొసైటీ సన్మానించింది. అనంతరం బహద్దూర్ వెంకటరామరెడ్డి జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా ఆర్‌బీవీఆర్‌ఆర్ పాఠశాలలో ఘనం గా నిర్వహించారు. అలాగే సొసైటీ గౌరవ సభ్యులందరు కలిసి అతిథులను శాలువతో సత్కరించి మోమెంటోలను అందించారు.