25 April, 2026 | 3:38 AM

స్వర్ణ భారతి ట్రస్ట్ సేవలు అభినందనీయం

25-04-2026 01:17 AM

కోదాడ మున్సిపల్ చైర్మన్ ఏర్నేని కుసుమ వెంకటరత్నం బాబు

కోదాడ ఏప్రిల్ 24,నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న కృషి అభినందనీయమని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ, వెంకటరత్నం బాబు అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని లక్ష్మీపురం కాలనీ 1వ వార్డులో ఏర్పాటుచేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని వైస్ చైర్మన్ దేవరపల్లి మల్లీశ్వరి, స్థానిక కౌన్సిలర్ సామినేని రజని ,నరేష్ లతో కలిసి ప్రారంభించి మాట్లాడారు.

యశోద ఆసుపత్రి వైద్యులు 300 మందికి ఉచితంగా వైద్య సేవలు అందించగా, సూర్యాపేట  లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించి  ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఆపరేషన్ అవసరమైన వారిని సూర్యాపేటకు తీసుకువెళ్లారు. ఎంతో సేవ చేస్తున్న స్థానిక కౌన్సిలర్ సామినేని రజని, నరేష్, ట్రస్ట్ సభ్యులను కొనియాడారు. ఈ కార్యక్రమంలో  ప్రధాన కార్యదర్శి చారుగుండ్ల ప్రవీణ, రాజశేఖర్,ఓరుగంటి కిట్టు, దేవరశెట్టి వెంకటేశ్వరరావు  పాల్గొనారు.