calender_icon.png 1 February, 2026 | 1:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీఆర్పీలో భారీగా చేరికలు

01-02-2026 12:06:05 AM

హైదరాబాద్, జనవరి 31(విజయక్రాంతి): కార్వాన్ నియోజకవర్గం నుంచి తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ)లోకి శనివారం భారీ సంఖ్యలో చేరికలు చోటుచేసుకున్నాయి. వివిధ రాజకీయ పార్టీలకు రాజీనామా చేసి సుమారు 150 మంది నాయకులు, కార్యకర్తలు టీఆర్పీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరారు.ఈ సంద ర్భంగా టీఆర్పీ కార్వాన్ నియోజకవర్గ ఇన్‌చార్జి టీవీఆర్ కొత్తగా చేరిన వారికి పార్టీ కం డువాలు కప్పి ఆహ్వానించారు.

టీఆర్పీ బీసీల ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు.పార్టీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నాయకత్వం, టీఆర్పీ తీసుకుంటున్న ప్రజాపక్ష విధానాలు తమను ఆకర్షించాయని నూతన సభ్యులు ఈ సందర్భంగా తెలిపారు. కార్వాన్ నియోజకవర్గంలో టీఆర్పీ మరింత బలోపేతం అవుతుందని వారు ధీమా వ్యక్తం చేశారు.