28 May, 2026 | 2:27 AM

దేశ సమగ్రాభివృద్ధికి నెహ్రూ చేసి సేవలు చిరస్మరణీయం

28-05-2026 01:53 AM

ఎమ్మెల్యే బీఎల్‌ఆర్

మిర్యాలగూడ, మే 27 :దేశ తొలి ప్రధానమంత్రిగా దేశాన్ని పారిశ్రామికంగా, సాంకేతికంగా అభివృద్ధి చేయడంతో పాటు దేశపురో అభివృద్ధికి పండిట్ జవహర్ లా ల్ నెహ్రూ చేసిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి(బిఎల్ ఆర్ ) అన్నారు. నెహ్రూ 62వ వర్ధంతి సందర్భంగా తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో నెహ్రు చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ లౌకికవాదం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణతో పాటు ఐఐటీలో ఏర్పాటుతోపాటు సాంకేతికతను ఎయిమ్స్ ఏర్పాటు చేసి వైద్య పరంగా దేశానికి అత్యుత్తమైన వైద్య సేవలు అందించడం భారీ ప్రాజెక్టులు, పరిశ్రమల ఏర్పాటు కు ఆయన చేసిన కృషి అభినందనీయమన్నారు. దేశ సమగ్ర,సర్వతో ముఖా భివృద్ధికి నెహ్రు చేసిన సేవలను స్ఫూర్తిగా తీసుకొని దేశ అభివృద్ధికి నాయకులు, యువత పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, మాజీ కౌన్సిలర్ రుణాల్ రెడ్డి, సర్పంచ్ అందుగుల వెంకటయ్య, నాయకులు ఇంద్రపల్లి శ్రీనివాస్, బిఎల్ అర్ బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు.