calender_icon.png 14 May, 2025 | 8:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

SRNK ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సిల్వర్ జూబ్లీ వేడుకలను విజయవంతం చేయాలి

17-04-2025 07:03:56 PM

సమీక్ష సమావేశం నిర్వహించిన పోచారం...

బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ SRNK ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 24వ తేదీన జరగనున్న సిల్వర్ జూబ్లీ వేడుకలను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం SRNK ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలపై కళాశాల ప్రినిపాల్, అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సిల్వర్ జూబ్లీ వేడుకలకు కళాశాలలో విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థిని విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు హాజరై సిల్వర్ జూబ్లీ వేడుకలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ తో పాటు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.