calender_icon.png 11 November, 2025 | 9:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బస్సు ఇంజిన్ లో మంటలు చెలరేగి బస్సు దగ్ధం

11-11-2025 08:23:49 AM

సురక్షితంగా బయటపడ్డ 29 మంది ప్రయాణికులు 

చిట్యాల,(విజయక్రాంతి): ప్రయాణిస్తున్న బస్సు ఇంజన్లో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైన సంఘటన మంగళవారం జాతీయ రహదారి 65 పై చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామం వద్ద బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుండి నెల్లూరు వెళ్తున్న విహారి ట్రావెల్స్ బస్సు బస్సు నెంబర్ ఎన్ ఎల్ 01 బి 3250 గల  ఇంజన్లో నుండి మంటలు రావటంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు ఉండగా బస్సు ఇంజన్ లో మంటలు రావడంతో డ్రైవర్ అప్రమత్తమై ప్రయాణికులను బస్సు నుండి కిందికి దింపాడు. దీంతో ప్రయాణికులు అందరు సురక్షితంగా బయటపడగా  పెను ప్రమాదం తప్పింది.