calender_icon.png 11 November, 2025 | 10:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలీవుడ్‌ నటుడు ధర్మేంద్ర కన్నుమూత

11-11-2025 09:05:17 AM

ముంబై: బాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు ధర్మేంద్ర(Bollywood actor Dharmendra passes away) సోమవారం రాత్రి ముంబయిలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో 89 ఏళ్ల వయసులో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ధర్మేంద్ర దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నారు. సోమవారం మధ్యాహ్నం ఆయనను ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు తరలించారు. వెంటిలేటర్‌పై ఉంచారు. అంతకుముందు, ధర్మేంద్ర ఆరోగ్యం క్షీణిస్తోందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. గత వారం ఆయనను బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేర్చారు. సందర్శకులను నివారించడానికి గత కొన్ని రోజులుగా ఆయన ఐసియులో ఉన్నారు. అయితే, నిన్న మధ్యాహ్నం ఆయన పరిస్థితి మరింత దిగజారిందని వైద్యులు తెలిపారు.

89 ఏళ్ల ఈ అనుభవజ్ఞుడైన నటుడు తన సుదీర్ఘ సినీ జీవితంలో 300 కి పైగా చిత్రాలలో నటించారు. ధర్మేంద్ర బాలీవుడ్ సీనియర్ నటి హేమవాలిని భర్త. త్వరలో విడుదల కానున్న ఇక్కీస్ లో ధర్మేంద్ర నటించారు. ధర్మేంద్ర అసలు పేరు ధర్మేంద్ర కెవల్ కిషన్ డియోల్. 1935 డిసెంబర్ 8న ధర్మేంద్ర జన్మించారు. 2012లో ధర్మేంద్ర పద్మభూషన్ అందుకున్నారు. 204లో బికనీర్ నుంచి ధర్మేంద్ర ఎంగీ గెలిచారు. బాలీవుడ్ హీ మ్యాన్ గా ధర్మేంద్ర ఖ్యాతి గడించారు. ధర్మేంద్ర ఫిల్మ్ ఫేర్ లైఫ్ లైన్ అచీవ్ మెంట్ అవార్డు అందుకున్నారు. 1954లో ప్రకాశ్ కౌర్ ను ధర్మేంద్ర వివాహం చేసుకున్నారు. 1980లో ఆయన హేమామాలినిని రెండో వివాహం చేసుకున్నారు. ధర్మేంద్రకు సన్నీ డియోల్, బాబీ డియోల్, ఈషా సహా ఆరుగులు సంతానం ఉన్నారు. షోలే, ఆయి మిలాన్ కి బేలా, ఫూల్ ఔర్ పత్తర్, ప్యార్ కియాతో డర్నా క్యా, సీతా ఔర్ గీతా, జీవన్ మృత్య్, మేరా గావ్- మేరా దేశ్, రాజా జానీ, యాదోంకీ బారత్, దోస్త్, చారస్, ధర్మవీర్ సినిమాతో పాటు పలు ప్రముఖ చిత్రాల్లో ధర్మేంద్ర నటించారు.