ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 వరి రకాలను రైతులు సాగుచేసి బోనస్ పొందాలి
యూరియా కొరతపై రైతులకు ఆందోళన అవసరం లేదు
కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి, జూన్ 23 (విజయక్రాంతి): రైతులు 7 వరి రకాలను సాగుచేసి ప్రభుత్వ బోనస్ పొందాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్ సూచించారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఎల్లంపేట రైతు వేదికలో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమానికి హాజరై ఆయన మాట్లాడారు.
అనంతరం పాల్వంచ మండలం ఏల్పుగొండ గ్రామంలో యూరియా పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు. రైతులు యూరియాను ప్రత్యేక యాప్ ద్వారా బుక్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని రైతుల అవసరాలకు సరిపడా యూరియా నిలువలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఎలాంటి కొరత లేదని పేర్కొన్నారు. యాప్ లో బుక్ చేసిన అనంతరం రెండు రోజుల వరకు ఎరువుల బస్తాలను పొందే అవకాశం ఉంటుందని రైతుల ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు.
రైతులకు అవసరమైన సమయంలో యూరిక్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. రైతులు ఆదేవనాలను పెంచుకునేందుకు ఆయిల్ ఫాం సాగును ప్రోత్సహించాలని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు సబ్సిడీలను సద్వి నీ యోగం చేసుకోవాలని తెలిపారు. ఏలి నో ప్రభావం నేపథ్యంలో వర్షపాతం పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు మట్టిలో తగిన తేమ ఏర్పడిన తర్వాతే విత్తనాలను వేయాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు.
తొందరపడి రైతులు విత్తనాలు చల్లకుండా పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలు, స్వల్ప కాలిక పంట రకాలను ఎంపిక చేసుకోవాలని రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి, అదనపు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అపర్ణ, తాసిల్దార్ సరళ భాయ్, ఎంపీడీవో గోపి బాబు, మండల వ్యవసాయ అధికారి పవన్ కుమార్, వ్యవసాయ విస్తరణ అధికారి రవి పాల్గొన్నారు.






