24 April, 2026 | 3:13 PM

కంటి ఆకాశం.. -మది కొలను

17-06-2024 12:00 AM

కాటుకద్దుకున్న సుందరి కన్నులా 

విచ్చుకున్న ఆకాశం 

ఆమె కంటి అద్దంలో ప్రతిబింబిస్తున్న చెలికాడిలా 

ప్రతిఫలిస్తున్న చందురుడు 

ప్రియుణ్ణి వలచి ఒళ్ళిరుచుకున్న భామల్లా

విచ్చుకున్న కలువలు

ప్రియుడి చెంతకు ఎగదోస్తున్న

కొలను అలల చెలికత్తెలు

చెలి వియోగ విరహుడొకడు

కొలనంచున కూచుండి పరికించి చూస్తున్న

ప్రకృతి సుందర దృశ్యం

పరవశంతో కనులుమూసి వెల్లకిలా పడుకుంటే...

మదికొలనులో ఆగక తడలు తడలుగా వస్తున్న చెలి తలపులు

తప్పించుకోను కనులు తెరిస్తే....

కంటి ఆకాశాన మిణుకు మిణుకుమంటున్న

ఇద్దరి తీపి గురుతులు

ఇప్పుడు...

తాను.. తనముందరి కొలను...

రెండూ....ఒకేతీరూ....

 దిలీప్.వి

సెల్:8464030808