calender_icon.png 8 July, 2025 | 7:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేయాలి

03-07-2025 12:00:00 AM

డీసీసీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి 

మేడ్చల్, జూలై 2(విజయ క్రాంతి): జై బాబు జై భీమ్ జై సంవిధాన్ లో భాగంగా ఈ నెల 4న హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో జరగనున్న అన్ని విభాగాల అధ్యక్షుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అన్నా రు.

బుధవారం బోడుప్పల్ లో జరిగిన నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆత్మీయ స మ్మేళనానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్యఅతిథిగా హాజరవుతారన్నారు. ఆత్మీయ సమ్మేళనానికి పెద్ద ఎత్తున తరలి రా వాలన్నారు.

ఈ సమావేశంలో టిపిసిసి ప్ర ధాన కార్యదర్శి పీసరి మహిపాల్ రెడ్డి, మా జీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి వజ్రేస్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నరసింహులు యాద వ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జీడిపల్లి వేణుగోపాల్ రెడ్డి, వేముల మహేష్ గౌడ్, సీనియ ర్ నాయకులు దర్గా దయాకర్ రెడ్డి, విగ్నేశ్వర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొమ్మకు అజయ్, ఆర్టిఏ మెంబర్ భీమిడి జైపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.