03-07-2025 12:00:00 AM
కూకట్పల్లి జూలై 2 (విజయక్రాంతి): సామాజిక మధ్యమాలలో ఇన్ఫ్లెన్స్ ద్వారా వచ్చిన నగదు ప్రతి నెల తనకు ఇవ్వాలని రౌడీషీటర్ సయ్యద్ షాహిద్ తోటి స్నేహితుడిని బెదిరిస్తూ అతడి చేతిలోనే గత నెల 29వ తేదిన హత్యకు గురయ్యాడు. ఈ హత్య కేసును చేదించిన కూకట్ పల్లి పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్ తరలించారు.
బుధవారం కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాలానగర్ డిసిపి సురేష్ కుమార్ నిందితుల వివరాలు వెల్లడించారు. బోరబండ పండిత్ నెహ్రూ నగర్ కు చెందిన సయ్యద్ షాహిద్ (26) రౌడీ షీటర్ చలామణి అవుతూ పలువురిని బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తూ ఉండేవాడు. అత డి స్నేహితుడు సమీర్ ఖాన్ ఇంస్టాగ్రామ్ ఇన్ఫ్లెన్స్ గా పనిచేస్తున్నాడు.
ఇతడికి ఇరవై మూడు వేల ముమంది ఫాలోవర్స్ ఉండగా నెలకు కొంత ఆదాయం వస్తుంది. అయితే వచ్చిన నగదులో నెలకు 5000 రూపాయ లు ఇవ్వాలని రౌడీషీటర్స్ సయ్యద్ షాహిద్ డిమాండ్ చేశాడు. ఇది మనసులో పెట్టుకొని ఎలాగైనా సయ్యద్ ను హత్య చేయా లని తన తోటి స్నేహితులైన హనక్ ఆలియా స్ మున్నా, ఎండి సాజిద్ తో కలసి గతల నెల రోజులుగా పథకం వేశారు. అతన్ని అం తముందిస్తే తాము కూడా స్థానిక రౌడీషీటర్లు గా స్థిరపడొచ్చు అని అనుకున్నారు.
అయితే మరో స్నేహితుడు పవన్ పుట్టినరోజును ఆసరాగా చేసుకుని సయ్యద్ సాహిద్ తోపాటు మున్నా, సాజిద్, సమీర్ అందరు కలిసి దేవిస్తాన్ హోమ్స్ వెనక భాగంలోని ఖాళీ ప్రదేశంలో మద్యం సేవించారు. మ ద్యం మత్తు లోకి జారుకున్నాక సాజిద్ బీర్ బాటిల్ తో గొంతుపై పొడిచి రాళ్లతో తలపై మోది హత్య చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తిం చి అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. ఈ సమావేశంలో కూకట్పల్లి ఏసీ బీ రవి కిరణ్ రెడ్డి, సిఐ రాజేష్, డిఐ వెంకటేశ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.