calender_icon.png 6 May, 2025 | 5:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రం దివాలా తీయలేదు

06-05-2025 12:58:45 AM

  1. మేధోపరంగా దివాళా తీసింది మీరు.. మీ కాంగ్రెస్ పార్టీ
  2. సీఎం రేవంత్ వ్యాఖ్యలకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్

హైదరాబాద్, మే 5 (విజయక్రాంతి): ‘రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉంది. వచ్చే ఆదాయంలో సగం అప్పులు, మిత్తీల చెల్లింపులకే పోతుంది’ అని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ‘తెలంగాణ దివాళా తీయలేదు సీఎం గారూ.. మేధోపరం గా దివాళా తీసింది మీరు.. మీ కాం గ్రెస్ పార్టీ.

ఫలితంగా నైతికంగా నష్టపోయిందీ మీరే..’ అంటూ ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు. ఈ మేరకు మంగళవారం మీడియా సమావేశం నిర్వ హించి, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతానని స్పష్టం చేశారు.