06-05-2025 12:40:02 AM
భద్రాద్రి కొత్తగూడెం, మే 5 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకుల పల్లి మండలం గంగారం రెవెన్యూలో వం దల ఎకరాల భూ కబ్జాలకు స్థానిక నాయకులు, పాల్వంచ కేటీపీఎస్ ఉద్యోగులు భారీ స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. గంగారం రెవె న్యూ పరిధిలో దొరల కాలం నుంచి వేల ఎకరాల్లో సాగులో ఉంటున్న 303/2/84 సర్వే నంబర్లో రెవెన్యూ సబ్ డివిజన్ కాకపోవడంతో వేల ఎకరాలకు ఒకే సర్వే నంబర్ ఉంది.
అప్పట్లో ప్రభుత్వం సీలింగ్ యాక్ట్ తీసుకురావడంతో వేల ఎకరాలు ఉన్న దొరలు తమకు అనుకూలంగా, వారి వద్ద పనిచేస్తు న్న వారి పేర భూములను రికార్డుల్లో నమో దు చేశారు. కాలక్రమేణా దొరలు ప్రభుత్వానికి కొంత భూమిని వదిలేసి, పిల్లల భవి ష్యత్ దృష్ట్యా విదేశాలకు, పట్టణాలకు వెళ్లిపోయారు.
ఇప్పటికీ రెవిన్యూ రికార్డుల్లో పట్టాభూములు వారి పేరుతోనే ఉన్నాయి. ఇదే అదునుగా భావించిన కొంతమంది చ ట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకొని భూ కబ్జాలకు సమాయత్తమయ్యారు.
వందల ఎకరాల కబ్జాకు ప్రణాళిక
గంగారం రెవెన్యూ పరిధిలో వందల ఎకరాల భూ ముల కబ్జాకు ఒక ముఠా ప్రయ త్నిస్తున్నదని ‘విజయక్రాంతి’లో కథనాలు రావటంతో మరికొన్ని అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. కేటీపీఎస్లో ఉన్నత ఉద్యోగం చేస్తున్న ఉద్యోగి, కిందిస్థాయి ఉద్యోగి స్థానికంగా ఉన్న కొంత మంది నా యకులతో చే తులు కలిపి సుమారు 500 నుంచి 700 ఎకరాల కబ్జాకు ప్రణాళికలు రూపొందించారు.
వారి ప్రణాళిక ఆచరణలోకి వచ్చేందు కు స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులు, సిబ్బందికి లక్షల రూపాయలు ఎర చూపి, పహాణీల్లో వారి పేర్లు నమోదు చేయించుకునేందుకు ప్రయత్నించారు. ఎప్ప టి నుంచో ఆ భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న కొంతమంది రైతులకు, ఈ భూములు తమవని కలెక్టర్ కోర్టు ద్వారా నోటీసులు పంపించారు.
కబ్జాకోరుల విషయం బహిర్గతం ఇలా..
గంగారం రెవెన్యూ పరిధిలో ఏళ్లుగా 12 ఎకరాల భూమిలో సాగు చేసుకుంటూ, ఇల్లు నిర్మించుకొని జీవనం సాగిస్తున్న వృద్ధ దంపతుల భూమిపై కూడా వీరి కన్ను పడింది. నాన్ జ్యుడిషియల్ తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించారు. కేటీపీఎస్ ఉన్నత ఉద్యోగి తాను గిరిజనుడిని అనే ధీమాతో అబ్బినేని సాంబశివరావు అనే వృద్ధ రైతుకు ఆ భూమి తనదని కలెక్టర్ కోర్టు ద్వారా నోటీసులు పంపించారు.
నోటీసులను చూసిన వృద్ధ దంపతులు ఒకింత భయం ఏర్పడి మూర్చపోయారు. తేరుకున్న తర్వాత విషయాన్ని వారి మనవళ్ళకు తెలుపడంతో నోటీసు ఆధారంగా వారి వద్ద ఉన్న డాక్యుమెంట్లను రిజిస్టర్ కార్యాలయానికి సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు సేకరించారు. సదరు కేటీపీఎస్ డీఈ గుడివాడ నుంచి తప్పుడు డాక్యుమెంట్లను సృ ష్టించాడని బహిర్గతమైంది.
స్థానిక ముఠా నాయకులతో కేటీపీఎస్ డీఈ కుమ్మక్కు
గంగారం రెవెన్యూ పరిధిలోని స్థానికంగా ఉన్న కొంతమంది అమాయక గిరిజనులను మచ్చిక చేసుకొని, డబ్బు ఆశ చూపించి అ న్ని విధాలుగా సహకరిస్తామని మచ్చిక చేసుకున్నారు. సదరు కేటీపీఎస్ డీఈ నూతన సంవత్సరం సందర్భంగా స్థానిక గిరిజనులకు, నాయకులకు భారీస్థాయిలో మద్యం, మాంసంతో ధావత్ లు కూడా ఏర్పాటు చేసినట్టు స్థానికులు చర్చించుకుంటున్నారు.
రెవెన్యూ అధికారులకు భారీ స్థాయిలో ముడుపులు?
భూములు కాజేసేందుకు అక్రమార్కులు టేకులపల్లి మండల రెవెన్యూ కార్యాలయంలో వీరికి సహకరించిన రెవెన్యూ అధికారులకు, సిబ్బందికి రూ.లక్షల్లో ముడుపులు అందించినట్టు తెలుస్తోంది. ఉన్నతాధికారులు ఈ భూ వివాదాలపై, కోర్టు నోటీసులపై సమగ్ర విచారణ చేపట్టి తప్పుడు పత్రాలు సృష్టించిన వారిపై, సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోకపోతే ఎంతో మంది అమాయక గిరిజన, గిరిజనేతర రైతులు వీరి ఆగడాలకు బలవుతారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ విషయంపై టేకులపల్లి ఇన్చార్జి తహసీల్దార్ను ‘విజయక్రాంతి’ ప్రతినిధి వివరణ కోరగా స్పందించలేదు.