28 April, 2026 | 3:01 AM

ఐటీలో రాష్ట్రం మేటి

28-04-2026 01:27 AM

ప్రభుత్వ విజన్‌తో ఐటీ హబ్‌గా హైదరాబాద్ 

  2025-26 ఆర్థిక సంవత్సరంలో 40 శాతంపైగా వృద్ధి

ఎగుమతుల రంగంలో తెలంగాణ ఆధిపత్యం 

సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు కృషి ఫలితం

హైదరాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): తెలంగాణ ఐటీ రంగం వేగంగా దూసుకుపోతున్నది. హైదరాబాద్ నగరం ఐటీ రంగానికి కేరాఫ్‌గా మారడంతో ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని రాష్ట్రవ్యాప్తంగా సాంకేతిక రంగం అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి సఫలమవుతున్నది. తెలంగాణ సంవత్సరానికి రూ.  3 లక్షల కోట్లకుపైగా ఐటీ ఎగుమతులు చేస్తుండటం గత రెండేళ్లుగా రాష్ట్ర ఐటీ రంగం వేగంగా ముందుకు సాగుతున్న తీరుకు సాక్ష్యం.

ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వ జయకేతనం కాదు, ఇది మారుతున్న ప్రపంచానికి సరిపోయేలా ఒక రాష్ట్రం తన భవిష్యత్తును ఎలా మలుచుకుంటుందో చూపించే ప్రయాణంగా చెప్పవచ్చు. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఐటీ రంగాన్ని రాష్ట్ర ఆర్థిక వ్యవ స్థకు ప్రధాన గ్రోత్ ఇంజిన్‌గా మార్చాలనే కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఈ దిశగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చేపట్టిన అంతర్జాతీయస్థాయి ప్రచారం, పెట్టుబడుల ఆకర్షణ, విధాన సంస్కరణలు తెలంగాణ ఐటీ ఎకో సిస్టం ను మరో మెట్టుకు తీసుకెళ్లాయి. పరిశ్రమల నుంచి నేరుగా నిపుణులను తీసుకొని విధానాలు రూపొందించడం, గ్లోబల్ కంపెనీ  లతో నిరంతర చర్చలు కొనసాగించడం వల్ల రాష్ట్రం ఇప్పుడు పెట్టుబడిదారులకు ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ మాత్రమే కాదు, ‘ఈజ్ ఆఫ్ గ్రోత్’ అందించే గమ్యంగానూ మారింది. 

40 శాతంపైగా వృద్ధి.. 

ప్రభుత్వ ప్రయత్నాల ఫలితంగా 2025--26 ఆర్థిక సంవత్సరానికి రూ.3.60 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు, 11 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. రెండేళ్లలో ఐటీ రంగంలో దాదాపు 40 శాతం పైగా వృద్ధి నమోదైంది. ఇది జాతీయ సగటును మించి ఉండటం విశేషం. 2023లో తెలంగాణవ్యాప్తంగా 9.5 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉండగా, 2024--25 నాటికి అది 10.2 లక్షలకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో అది 11 లక్షల మార్క్‌ను దాటే దిశ గా దూసుకెళ్తున్నది.

ఐటీ రంగంలో అభివృద్ధి సామాజిక భద్రతకూ, మధ్యతరగతి విస్తరణకూ ఎంతో కీలకం. అంతేకాదు, ఐటీ ఎదు గుదలతో హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్, ర వాణా, సేవా రంగాల్లో మరో 25 లక్షల మం ది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. దీనికితోడు ఇప్పటికే ప్రపంచంలో టాప్--3 జీసీ సీ డెస్టినేషన్లలో ఒకటిగా ఉన్న హైదరాబాద్‌లో 300కుపైగా జీసీసీలు ఉన్నాయి. యూరోప్, అమెరికా, ఆసియా, ఆస్ట్రేలియా కంపెనీలతో ముఖాముఖి సమావేశాలు జరుపుతూ ప్రత్యేక పాలసీలు, ప్రోత్సాహకాలపై ప్రజెంటేషన్లు ఇస్తూ మంత్రి శ్రీధర్ బాబు కొత్త జీసీసీలకు, పెట్టుబడులకు తలుపులు తెరుస్తున్నారు.

డాటా సెంటర్ల రంగం లోనూ తెలంగాణ సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్నది. తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమిట్‌లో ఇన్‌ఫ్రాకీ డీసీ పార్క్ నుంచి రూ.70 వేల కోట్లు, జేసీకే ఇన్‌ఫ్రా నుంచి రూ.9 వేల కోట్లు, ఏజీపీ గ్రూప్ నుంచి రూ.6,750 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయి. ఈ పెట్టుబడులతో 10 వేల ఉద్యోగాలు రానున్నాయి. డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ఈ డాటా సెంటర్లు తెలంగాణను దక్షిణాసియాలో కీలక డాటా హబ్‌గా నిలబెట్టే శక్తి కలిగి ఉన్నాయి.

భవిష్యత్ నగరంగా రూపొందుతున్న భారత్ ఫ్యూచర్ సిటీలో బ్రూక్ ఫీల్డ్-యాక్సిస్ వెంచర్స్ కూటమి రూ.75 వేల కోట్లతో గ్లోబల్ ఆర్ అండ్ డీ, డీప్టెక్ హబ్ ఏర్పాటు చేయనుండటం, ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ రూ.41 వేల కోట్లతో హైదరాబాద్‌లో స్మార్ట్ టెక్నాలజీ, డిజిటల్ మీడియా కేంద్రాన్ని ప్రతిపాదించింది. ఇవి తెలంగాణ ‘రైజింగ్ 2047’ లక్ష్యానికి బలమైన పునాదులుగా మారనున్నాయి. కేవలం సాంప్రదాయ ఐటీకి పరిమితం కాకుండా, క్రియేటివ్ ఎకానమీపై కూడా తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇ

మేజ్ 2.0 పాలసీ ద్వారా యానిమేషన్, గేమింగ్, మల్టీమీడియా, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు ప్రోత్సా హం ఇచ్చి యువత ప్రతిభను ప్రపంచ మా ర్కెట్‌కు తీసుకెళ్లే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. వర్క్ ఫ్రమ్ హోం మోడళ్లకు అనుకూల మౌలిక వసతులు, రాష్ట్రవ్యా ప్తంగా డిజిటల్ కనెక్టివిటీ పెంపుతో సమతుల్య అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగు త్నుది. ఈ ప్రయత్నాలకు, శ్రమకు ఫలితమే పెట్టుబడిదారుల విశ్వాసం.

దేశీయ, అంతర్జాతీయ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం, విభిన్న రం గాల్లో ఒప్పందాలు కుదుర్చుకోవడం రాష్ట్ర విధానాల స్థిరత్వాన్ని కొలుస్తున్నాయి. ప్రపం చ ఐటీ పటంలో తెలంగాణ స్థానం బలపడుతున్న వేళ, ఈ వృద్ధి కేవలం ఆర్థిక గణాంకా లకే పరిమితం కాకుండా సామాజిక మార్పు గా మన ముందుకు వస్తున్నది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం, శ్రీధర్‌బాబు నేతృత్వంలోని ఐటీ యంత్రాంగం ఐటీలో రాష్ట్రాన్ని మేటిగా మార్చేందుకు వేస్తున్న అడుగులు, భవితరాలకు బంగారు భవిష్యత్తును ఇస్తుందనడం లో ఎలాంటి సందేహం లేదు.

ఎగుమతుల రంగంలో తెలంగాణ ఆధిపత్యం..

తెలంగాణ రాష్ట్రం ఎగుమతుల రంగంలో గణనీయమైన వృద్ధిని సాధిస్తూ దేశంలో కీలక స్థానాన్ని సంపాదించుకున్నది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా విడుదల చేసిన హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇం డియన్ స్టేట్స్ 2024-25 నివేదిక ప్రకారం.. తెలంగాణ ఎగుమతుల విలువ ఒక్క ఏడాదిలోనే 5 వేల మిలియన్ డాలర్లకుపైగా పెరి గింది. ఇది రాష్ట్ర ఆర్థిక బలాన్ని, పరిశ్రమల సామర్థ్యాన్ని స్పష్టంగా చూపుతున్నది.

ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం 2023--24 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ నుంచి జరిగిన మొత్తం ఎగుమతుల విలువ 14,026 మిలియన్ డాలర్లు కాగా, 2024--25 నాటికి అది 19,123 మిలియన్ డాలర్లకు చేరింది. అంటే కేవలం ఒక ఏడాదిలోనే దాదాపు 36 శాతం వృద్ధి నమోదైంది. ఈ పెరుగుదలతో దేశవ్యాప్తంగా ఎక్కువ ఎగుమతులు చేసే రాష్ట్రాల జాబితాలో తెలంగాణకు ఏడో స్థానం లభించింది. ఇది రాష్ట్రానికి ఒక ముఖ్యమైన మైలు రాయి అని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ విజయానికి ప్రధాన కార ణం ఐటీ, ఫార్మాస్యూటికల్ రంగాలే. తెలంగాణ నుంచి ఎక్కువగా డ్రగ్ ఫార్ములేషన్లు, బల్క్ డ్రగ్స్, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రిడియెంట్స్ (ఏపీఐ), సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులు, ఐటీ సేవలు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి చెందిన ఫార్మా క్లస్టర్లు, ఐటీ హబ్ లు రాష్ట్ర ఎగుమతుల వృద్ధికి వెన్నెముకలా మారాయి. ఆర్థిక నిపుణుల మాటల్లో చెప్పాలంటే.. 2024 ఐటీ ఉత్పత్తుల ఎగు మతుల్లో దేశవ్యాప్తంగా పెరుగుదల కనిపించింది.

కానీ తెలంగాణలో ఐటీకి తోడు ఫా ర్మా రంగం కూడా సమానంగా బలంగా ఉం డటంతో, రాష్ట్రానికి అత్యధిక వృద్ధి సాధ్యమైంది. ఇదే తెలంగాణను ఇతర రాష్ట్రాల కం టే ప్రత్యేకంగా నిలబెట్టింది. ఫార్మా, ఐటీ రం గాలకే పరిమితం కాకుండా.. ఇంజినీరింగ్ సామగ్రి, రసాయనాలు, ఏరోస్పేస్ పరికరాలు వంటి తయారీ రంగ ఉత్పత్తులు కూ డా తెలంగాణ నుంచి ఎగుమతి అవుతున్నా యి. వ్యవసాయ రంగంలోనూ విత్తనాలు, బి య్యం, పత్తి వంటి ఉత్పత్తులు విదేశీ మార్కెట్లకు చేరుతున్నాయి.

ఈ విభిన్న రంగాల భాగస్వామ్యం రాష్ట్ర ఎగుమతులకు స్థిరత్వా న్ని ఇస్తున్నది. దేశవ్యాప్తంగా చూస్తే గుజరాత్ రాష్ట్రం ఎగుమతుల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నది. 2017-18లో సుమారు 70 వేల మిలియన్ డాలర్ల ఎగుమతులు చేసిన గుజరాత్, 2024--25 నాటికి 1,16,332 మిలి యన్ డాలర్ల విలువైన ఎగుమతులను నమోదుచేసింది. గత మూడేళ్లుగా అక్కడ ఎగుమతుల విలువల్లో కొంత తగ్గుదల కనిపించడం గమనార్హం. 2022-23లో 1.46 లక్షల మిలియన్ డాలర్లుగా ఉన్న ఎగుమతు లు, తరువాతి సంవత్సరాల్లో క్రమంగా తగ్గాయి.

ఇక యూటీ చండీగఢ్‌లో దేశంలోనే అత్యల్ప ఎగుమతులు నమోదయ్యాయి. 2024-25లో అక్కడి నుం చి జరిగిన మొత్తం ఎగుమతుల విలువ కేవ లం 14 మిలియన్ డాలర్లు మాత్రమే. తెలంగాణ కంటే ఎక్కువ ఎగుమతుల విలువ కలి గిన రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మ హారాష్ట్ర, తమిళనాడు,యూపీ ఉన్నాయి. తెలంగాణ ఎగుమతుల వృద్ధి ఆర్థి క అభివృద్ధికి బలమైన సంకేతంగా నిలుస్తున్నది. ఐటీ, ఫార్మా రంగాల ఆధారంగా సా గుతున్న ఈ ప్రగతి, భవిష్యత్తులో తెలంగాణను  మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉంది.