13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

రాష్ట్ర ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి ప్రవేశపెట్టిన బడ్జెట్

23-03-2026 12:35 AM

చేనేతకు కేటాయించిన బడ్జెట్ ఆ వర్గాల ఆత్మహత్యలకు పురిగొల్పేలా ఉందన్నారు

రాజన్న సిరిసిల్ల, మార్చి 22 (విజయక్రాంతి ):జిల్లా భారత రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మాజీ వైస్ చైర్మన్ మంచి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. సిరిసిల్ల తెలంగాణ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమస్యల్లో వారు మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముచ్చటగా మూడోసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏ వర్గానికి కూడా ఆశాజనకంగా లేదని ఆరోపించారు.

అన్ని వర్గాల వారిని విస్మరిస్తూ బడ్జెట్ ఆమోదించడం సిగ్గుచేటు అన్నారు. దామాషా ప్రకారం 56% ఉన్న బీసీలకు బడ్జెట్ మొండి చేయి చూపిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రధాన కెసిఆర్ రాష్ట్రాన్ని ఒక క్రమ పద్ధతిలో నడిపేందుకు అన్ని వర్గాల వారికి న్యాయం చేసే విధంగా రాష్ట్ర బడ్జెట్ రూపొందించి అందరికీ సమన్యాయం చేశారని గుర్తు చేశారు. దేశంలోనే తెలంగాణ రెండో స్థానానికి తీసుకెళ్లిన ఘనత కేసిఆర్ కి దక్కిందన్నారు.

సిరిసిల్ల లాంటి ప్రాంతంలో అత్యధిక జనాభా పవర్ లూమ్, టెక్స్టైల్ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని గత బడ్జెట్ 370 కోట్లు ఉంటే ఈసారి 256 కోట్లకు పుదించారని అన్నారు. పవర్లు పరిశ్రమకు అమలవుతున్న ఏ సంక్షేమ పథకాన్ని తొలగిస్తారు రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. ప్రత్యేక బడ్జెట్ అంచనాలు పెరుగుతుంటే చేనేత పరిశ్రమకు మాత్రం బడ్జెట్ తగ్గుతూ వస్తుందని ఆరోపించారు. దీంతో ఉపాధి కరువై మళ్లీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఉన్నదని అన్నారు.

ఇప్పటికే కేంద్రం నుండి ఎలాంటి సహాయ సహకారాలు లేక ప్రస్తుత బడ్జెట్ కూడా లేకపోవడంతో మళ్లీ సిరిసిల్ల పురిసిల్లగా మారే రోజులు వస్తాయని ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగానికి అత్యధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు లేకుంటే భవిష్యత్ పోరాటానికి సిద్ధపడతామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో... బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు బొల్లి రామ్మోహన్, పట్టణ ప్రధాన కార్యదర్శి మ్యాన రవి, ఎండి సత్తార్, మాజీ జెడ్పిటిసి కోడి యంతయ్య, తంగళ్ళపల్లి బిఆర్‌ఎస్ అధ్యక్షుడు గజబింక రాజన్న, గుండ్లపల్లి పూర్ణచందర్, సబ్బని హరీష్, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.