16 April, 2026 | 12:05 PM

Breaking News

కామ్రేడ్ పెద్దబ్బాయికు నివాళులర్పించిన పోతినేని సుదర్శన్   •   కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం: ఎనిమిది మంది భక్తులు మృతి   •   మాజీ సర్పంచ్ ను పరామర్శించిన మంత్రి పొంగులేటి   •   స్టేట్ 2వ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి ఘన సత్కారం   •   ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి పట్ల లోక్‌సభ సంతాపం   •   డీలిమిటేషన్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ   •   వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్   •   అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య.. పొలాల్లో లభ్యమైన బూడిద, అస్తికలు   •   ఆక్రమణలు తొలగించి అభివృద్ధికి సహకరించండి.   •   జై కిసాన్ రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులుగా కొత్త మహేష్   •  

ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

06-06-2025 01:17 AM

నారాయణఖేడ్, జూన్ 5:  నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని ఆయా వార్డులలో గురువారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం సంబంధించి భూమి పూజ  కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పట్టణంలో ఆయా వార్డులలో పర్యటిస్తూ స్థానిక ప్రజలతో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.

మున్సిపాలిటీ పరిధిలో తాగునీటికి సంబంధించి పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. పర్యావరణం దినోత్సవం సందర్భంగా స్థానిక ఆక్సిజన్ పార్కులో మొక్కలను నాటారు. అనంతరం పార్క్ ఆవరణలో చెత్తాచెదారం తొలగించే పనులను చేపట్టారు. ప్రతి ఒక్కరు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్,ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి హౌసింగ్ డిఇ సతీష్ తివారి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దారం శంకర్ సెట్, కౌన్సిలర్లు వివేకానంద హనుమాన్లు సద్దాం మాజీద్ , మూడరామకృష్ణ, పండరి రెడ్డి, ముంతాజ్, శ్రీకాంత్ రెడ్డి, శంకర్ ముదిరాజ్, శేఖర్ సెట్ ,నరేష్ యాదవ్, మొయినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.