19-01-2026 12:57:33 AM
మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
హైదరాబాద్, జనవరి 18 (విజయక్రాంతి): గత వారం, పది రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో, మీడియా రంగంలో విచిత్రమైన పరిస్థితులు చూస్తున్నామని, రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో దోచుకో, దాచుకో అన్నట్టు ఉందని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. దోచుకునే దాంట్లో సీఎం, మంత్రుల మధ్య పంచాయితీలు కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశా రు. ఆదివారం తెలంగాణ భవన్‌లో మీడి యా సమావేశంలో ఆయన మా ట్లాడారు.
ఈ గొడవ మంత్రి జూపల్లి కృష్ణారావుతో మొదలైందని, మంత్రి కొండా సురేఖ కూతురు స్వయంగా సీఎం, రెవెన్యూ మంత్రిపైనే ఆరోపణలు చేసిందన్నారు. హిల్ట్ పాలసీ ఒక మంత్రి, సినిమా టిక్కెట్ల గురించి మరో మంత్రి తెలియదని చెప్పడంతో రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలకు అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వ బాగోతం గురించి 6 నెలలుగా చర్చించుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ బాగోతం ఖమ్మం సభలో స్పష్టంగా అర్థమవుతుందన్నారు. రేవంత్‌రెడ్డిని ఒక పత్రిక అధిపతి కాపాడలేరని, ప్రజలే బుద్ధి చెప్తారన్నారు.