calender_icon.png 19 January, 2026 | 3:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వివేకానంద స్ఫూర్తిరత్న శ్రీనివాస్

19-01-2026 12:57:27 AM

ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపిక

హైదరాబాద్, జనవరి 18 (విజయక్రాంతి): గణతంత్ర దినోత్సవం  పురస్కరిం చుకుని ఈ ఏడాదికి హైదరాబాద్‌లోని ప్ర ముఖ సాంస్కృతిక సంస్థలు ‘వైద్యుల గ్లోబ ల్ ఫౌండేషన్, వసుంధర విజ్ఞాన వికాస మండలి’ ఆధ్వర్యంలో వివిధ రంగాలలోని ప్రతిభావంతులకు స్ఫూర్తిరత్న పురస్కారాలను ప్రకటించారు.  రాజమండ్రికి చెందిన ఔత్సహిక రచయిత, తెలంగాణ అసెంబ్లీ కాం గ్రెస్ కార్యాలయంలో పని చేస్తున్న శ్రీపాద శ్రీనివాసుకు ప్రతిష్టాత్మక వివేకానంద స్ఫూ ర్తి రత్న పురస్కారాన్ని ప్రకటించారు. శ్రీపాద రచించిన 16కు పైగా కథలు, కథానికలు తన స్వీయ స్వరంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ద్వారా వినిపించారు.

ఇంకా గుం డె చప్పుళ్ళు, చట్టసభల్లో గోదావరి గళం, మనసున ఉన్నది,  అంత రంగం వంటి నాలుగు పుస్తకాలను రచించా రు. శ్రీపాద శ్రీనివాస్ రచించిన పుస్తకాలకు మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క, మాజీ ఎంపీ ఉండవల్లి అరు ణ్‌కుమార్, మండలి బుద్ధ ప్రసాద్ ముందు మాటను అందించారు. శ్రీపాద శ్రీనివాస్ సాంస్కృతిక నగరం రాజమండ్రి నివాసి అయినప్పటికీ హైదరాబాద్ లో స్థిరపడ్డారు. తెలంగాణ సాహిత్య, కళా సంస్థల అభిమానాన్ని చూరగొని వరుసగా మూడవ  పురస్కారంగా ‘వివేకానంద స్ఫూర్తి రత్న‘ అందుకోబోతున్నారు.