calender_icon.png 20 January, 2026 | 6:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మమ్మల్ని చార్మినార్‌లో కలుపొద్దు!

19-01-2026 12:59:01 AM

  1. రంగారెడ్డి జిల్లాలో సంగం ఎంఐఎంకు అప్పజెప్పాలనే ప్రయత్నం
  2. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

హైదరాబాద్, జనవరి 18 (విజయక్రాంతి): రంగారెడ్డి చుట్టుపక్కల ఉన్న గ్రామా లను చార్మినార్‌లో కలుపుతున్నారని, రంగారెడ్డి జిల్లాలో సంగం ఎంఐఎంకు అప్పజె ప్పాలనే ప్రయత్నం జరుగుతున్నదని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. పన్నులు కట్టనివారితో తమను ఎందుకు కలుపుతున్నారని వ్యాఖ్యానించారు. ఆదివారం హైద రాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నంతో కలిసి ఆయన మాట్లాడారు. పాతబస్తీలో నీళ్లబిల్లులు, కరెం ట్ బిల్లులు కడతారా? కట్టని వారితో మా జిల్లా ప్రజలను ఎందుకు కలుపుతున్నారని ప్రశ్నించారు.

మెజారిటీగా హిందూ ప్రజలున్న గ్రామాలను చార్మినార్‌లో కలపడం సరికాదని, లేకుంటే రంగారెడ్డిని కార్పొరేషన్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా మున్సిపల్ విభజన జరుగుతోందని మండిపడ్డారు. పాతబస్తీలో బిల్లుల ఎగవేత వల్ల వాటర్ బోర్డ్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ నష్టాల పాలవుతున్నాయని, రంగారెడ్డిలోని గ్రామాలను చార్మినార్‌లో కలపడం వల్ల, జిల్లా ప్రజల బతుకులు ఆగమవుతాయని పేర్కొన్నారు.

తమకు గులాంలు కొట్టడం తెలియదని, హైదరాబాద్‌కు ఆర్థిక వనరు రంగారెడ్డి అని, రంగారెడ్డి ఖజానా అంతా నాడు కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు తరలిపోయిందని, నేడు ఎంఐఎం ఇలా కాలోకి పంపేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లాపై అనేక అపోహ లు ఉన్నాయని, రంగారెడ్డి జిల్లాను ముక్కలు చెయ్యొద్దని, ప్రజాభిప్రాయం తర్వాత నిర్ణ యం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.