23 July, 2026 | 1:52 AM

రాష్ట్ర కల్లు గీత కార్మికుల బస్సుయాత్రను విజయవంతం చేయాలి

23-07-2026 12:00 AM

గోపా డివిజన్ అధ్యక్షుడు చిలువేరు సమ్మయ్య గౌడ్

కేసముద్రం, జులై 22 (విజయక్రాంతి):తెలంగాణ గీత కార్మికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్ర కల్లు గీత కార్మికుల బస్సు యాత్ర పోస్టర్ను కేసముద్రంలో గోపా డివిజన్ అధ్యక్షులు చిలువేరు సమ్మయ్య గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గీత కార్మికుల హక్కుల పరిరక్షణ, గీత వృత్తి అభివృద్ధి, సంక్షేమ పథకాల సమర్థ అమలు, పెండింగ్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న ఈ బస్సు యాత్రను ప్రతి గీత కార్మికుడు తన సొంత కార్యక్రమంగా భావించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

వీరశివాజీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఈ ఏడాది ఆగస్టు 2 నుంచి 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ యాత్ర కొనసాగుతుందని చెప్పారు. కేజీ కేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.వి. రమణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు తదితర రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ బస్సు యాత్ర మహబూబాబాద్ జిల్లా నుంచి ప్రారంభం కావడం జిల్లాకు గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బబ్బురు ఉప్పలయ్య, మోడెం వెంకటేశ్వర్లు, మేడి వెంకటేశ్వర్లు, పలుస వెంకన్న, ఓరుగంటి వెంకన్న, చింతనూరి వెంకన్న, ఇనుగుర్తి వెంకన్న, రడం వెంకన్న, కదిర సోమయ్య, జోగు రవీందర్, రాంపల్లి వెంకన్న పాల్గొన్నారు.