23 July, 2026 | 1:49 AM

శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని సందర్శించిన పర్యాటకశాఖ అధికారులు

23-07-2026 12:00 AM

మఠంపల్లి , జూలై 22 : మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం మహాక్షేత్రమునకు పర్యాటక ప్రాంతముగా అభివృద్ధి కొరకు 13 కోట్లు మంజూరూ చేస్తూ తెలంగాణ ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయమై పర్యాటక శాఖ ఎక్జిక్యూటీవ్ డైరెక్టర్ ఉపేందర్ రెడ్డి మట్టపల్లి మహాక్షేత్రమునకు విచ్చేసి పర్యాటక ప్రాంత అభివృద్ధిలో భాగంగా వివిధ నిర్మాణములు చేయుటకు స్థల పరిశీలన చేశారు.

అనంతరం దేవస్థాన అనువంశక ధర్మకర్తలు, మట్టపల్లి గ్రామ సర్పంచ్ సూచనలు సలహాలు తీసుకున్నారు.తదుపరి శ్రీ స్వామి వారి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు.దేవస్థాన అర్చకలు వేదమంత్రములతో ఆశీర్వచనముచేసిన తదుపరి దేవస్థాన అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్ కుమార్ లు శేషవస్త్రముతో సత్కరించారు. కార్యక్రమములో హుజూర్నగర్ ఆర్.డి.ఓ వి.శ్రీనివాసులు, ఎమ్మార్వో హిమబిందు,దేవస్థాన కార్యనిర్వహణాధికారి టి.వి.చలపతి,గ్రామ సర్పంచ్ రామిశెట్టి విజయశాంతి అప్పారావు,ఆర్‌ఐ శివ,మట్టపల్లి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.