1 March, 2026 | 3:16 PM

కథ మొదలిక..

01-03-2026 12:26 AM

అశోక్ గల్లా, శ్రీగౌరీప్రియ జంటగా నటించిన చిత్రం ‘VISA వింటారా సరదాగా’. నూతన దర్శకుడు ఉద్భవ్ రఘు తెరకెక్కిస్తున్న ఈ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. ఇందులో రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ వేసవిలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచనున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే టీజర్ విడుదలైంది. శనివారం తొలిగీతం ‘అనగా అనగా అమెరికా’ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘అనగా అనగా అమెరికా.. కథ మొదలిక.. మది గదులని తెరువగా..’ అంటూ సాగుతోందీ పాట. సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ స్వరపర్చిన ఈ పాటకు సనారె సాహిత్యం అందించగా, సంజిత్ హెగ్డే ఆలపించారు.